సాహోను అందుకే స్కిప్‌ చేసిందా? | Sakshi
Sakshi News home page

సాహోను అందుకే స్కిప్‌ చేసిందా?

Published Wed, Nov 29 2017 11:45 PM

Here's why Alia Bhatt rejected Prabhas' 'Saaho'  - Sakshi

బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఇమేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. అతడి తాజా సినిమా ‘సాహో’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా మొదట అనుష్కను అనుకోవడం, బరువు సమస్య కారణంగా ఆమె ఆ అవకాశాన్ని వదులుకోవడం, ఆ తర్వాత ఆ పాత్రను ప్రస్తుతం శ్రద్ధాకపూర్‌ పోషిస్తూ ఉండటం తెలిసిందే. అయితే శ్రద్ధాకపూర్‌ కంటే ముందు నిర్మాతలు ఆలియా భట్‌ను సంప్రదించారు. అయితే ఆమె సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించింది. చాలా రోజుల వరకూ కారణం బయటకు చెప్పకపోయినా ఇప్పుడు ఆమె సన్నిహిత వర్గాలు అసలు సంగతి చెప్పాయి. ‘ఆలియా భట్‌ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి నిశ్చయించుకున్నారు. నటనకు విలువిచ్చే పాత్రలు చేస్తూ కెరీర్‌లో ఒక దశకు చేరుకోవాలని భావిస్తూ ఉన్నారు. ‘సాహో’లో ఆఫర్‌ చేసిన పాత్ర ఆమెకు తగినంత స్క్రీన్‌ స్పేస్‌ను ఇచ్చేదిగా లేదని ఆమె భావించారు. వచ్చిన అవకాశం మంచిదే అయినా కుటుంబంతో చర్చించి, ఆమె దానిని వదులుకున్నారు. ఇక దీని గురించి ఆమె బాధపడుతున్నది కూడా ఏమీ లేదు’’ అని ఆ వర్గాలు చెప్పాయి. ‘సాహో’ని వదులుకున్నప్పటికీ సౌత్‌లో తన అభిమాన హీరో ప్రభాస్‌ అంటున్నారు ఆలియా భట్‌.
 

Advertisement
Advertisement