ట్రంప్ బాటలో సౌదీ..విదేశీయులపై వేటు

ట్రంప్ బాటలో సౌదీ..విదేశీయులపై వేటు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి క్రమక్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. విదేశీ ఉద్యోగులపై వేటు వేస్తూ తమ స్థానికులకే ఉద్యోగాల కల్పనంటూ ముందుకు వెళ్తున్నాయి. ఇటీవలే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు వీసా నిబంధనల్లో కఠినతరమైన మార్పులు తీసుకురాగా..  తాజాగా సౌదీ అరేబియా కూడా విదేశీయులపై వేటు వేస్తోంది. తమ దేశ షాపింగ్ మాల్స్లో విదేశీయులు పనిచేయడానికి వీలులేదంటూ నిబంధనలను జారీచేస్తోంది.. తమ దీర్ఘకాలిక ఆర్థిక సమగ్రతలో భాగంగా తమ సిటిజన్లకే ఉద్యోగవకాశాలు మెరుగుపరుచనున్నామని సౌదీ అరేబియా చెప్పింది.

 

ఈ నిర్ణయంతో 35వేల ఉద్యోగాలను కల్పించే అవకాశముందని ఆ దేశ కార్మిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఖలేద్ అబా అల్ ఖైల్ చెప్పారు. ఫారిన్ లేబర్ కాంట్రాక్టులతో కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గడువిస్తామని పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు బట్టి ఈ నిబంధనలు సౌదీ అమల్లోకి తీసుకొస్తుందని అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ  ఓ ప్రకటనలో తెలిపింది. చమురుపైనే  ఎక్కువగా ఆధారపడిన దేశంలో ఉద్యోగవకాశాలు కల్పించడం చాలా కీలకమైన అంశమని డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. 25 ఏళ్ల కంటే తక్కువ వయసున వారు కనీసం సగం మంది ఉద్యోగం కోసం వెతుకులాడుతున్నారని చెప్పారు. సౌదీ స్థానికుల్లో నిరుద్యోగిత కూడా నాలుగో త్రైమాసికంలో 12.3 శాతం పెరిగిందని రిపోర్టులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మాల్స్ లో పనిచేసే విదేశీయులపై వేటు వేసి, స్థానికులకు  ఉద్యోగాలు కల్పించాలని సౌదీ నిర్ణయించింది. 
Back to Top