భారత్‌తో సంబంధాలపై అమెరికా తీర్మానం | Sakshi
Sakshi News home page

భారత్‌తో సంబంధాలపై అమెరికా తీర్మానం

Published Fri, Jan 30 2015 3:00 AM

Indo-US relationship essential to promote stability and prosperity in 21st century

వాషింగ్టన్: 21వ శతాబ్దంలో సుస్థిరత, సౌభాగ్యం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంటూ అమెరికా పార్లమెంటులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో జనవరి 27న డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత జోసెఫ్ క్రోలీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెండు దేశాల్లోనూ ప్రజాస్వామ్య విలువలు వేళ్లూనుకొని ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కృషి చేయడం ఇకపైనా కొనసాగించాలని అందులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement