ప్రేమ ఎంత దూరం.. | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎంత దూరం..

Published Sun, Apr 30 2017 11:41 AM

ప్రేమ ఎంత దూరం..

అమ్మాయి పేరు ఇలరియా.. దేశం ఇటలీ. అబ్బాయి పేరు జుల్‌ఫికర్‌ .. దేశం ఇండోనేషియా ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య దూరం సుమారు 11 వేల కిలోమీటర్లు అయితేనేం వీరిద్దరినీ ఏకం చేసింది ‘ప్రేమ’. అవును.. రెండేళ్ల క్రితం వీరిద్దరూ ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు.అది కాస్తా ప్రేమగా మారింది. కానీ వాళ్లిద్దరూ కలసి ఒక్కటవ్వడానికి దూరం అడ్డుగా నిలిచింది. అన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని దాటి ఒకరినొకరు చేరుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు వారి వద్ద లేవు. అయితేనేం ప్రేమ ఉందిగా.. ప్రేమను గెలిపించుకోవడం కోసం ఇలరియా రెస్టారెంట్‌లో వెయిటర్‌గా రెండేళ్ల పాటు పనిచేసి కొద్ది మొత్తంలో డబ్బులు కూడపెట్టింది.

ఆ సొమ్ముతో విమాన టికెట్‌ను కొనేసి నేరుగా ఇండోనేసియాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న తన ప్రియుడిని కలుసుకుంది. అయితే ఒక విదేశీయురాలిని తమ గ్రామంలో చూసేసరికి గ్రామస్తులందూ ఆశ్చర్యపోయారు. అక్కడి పోలీసులు కూడా అనుమానంతో ఆమెను విచారించారు. చివరికి ప్రేమికుడి కోసమే ఇలరియా దేశం కాని దేశం వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వీరిద్దరి ప్రేమకు జుల్‌ఫికర్‌ కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం కూడా లభించింది. ఇంకేముంది రెండేళ్ల వీరి ప్రేమకు త్వరలో పెళ్లితో శుభం కార్డు పడనుంది.

Advertisement
Advertisement