తెలంగాణ తాలిబాన్‌గా టీఆర్‌ఎస్: షబ్బీర్ | Sakshi
Sakshi News home page

తెలంగాణ తాలిబాన్‌గా టీఆర్‌ఎస్: షబ్బీర్

Published Mon, Aug 3 2015 1:17 AM

తెలంగాణ తాలిబాన్‌గా టీఆర్‌ఎస్: షబ్బీర్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విధ్వంసం చేస్తూ తెలంగాణ తాలిబాన్‌గా టీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో విమర్శించారు. గత ప్రభుత్వాల ఘన చరిత్రను, చారిత్రక స్మృతులను తుడిచివేసేలా సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నాలుగు శతాబ్దాలనాటి కుతుబ్‌షాహీల సమాధులు సురక్షితంగా ఉన్నప్పుడు, 1919లో నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రిని కాపాడలేరా? అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని కాపాడుతూనే,  అదే ఆవరణలో కొత్త ఆసుపత్రి నిర్మించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement