చేయని నేరం
‘డెరిక్‌ను నిర్దోషిగా పరిగణిస్తున్నాం’ అని న్యూయార్క్ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి రేమండ్ గజ్మన్ తీర్పు ఇవ్వడంతో డెరిక్ ముఖం వికసించింది. ఒక హత్య కేసులో జైలుపాలైన ఇరవై రెండేళ్ల తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాడు. కోర్టు వెలుపల మీడియా అతడిని చుట్టుముట్టింది. డెరిక్ తొలిసారి పెదవి విప్పాడు. ‘పోలీసు డిటెక్టివ్ లూయీ సార్సెల్లా నన్ను ఈ కేసులో ఇరికించాడు’ అని చెప్పాడు. న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రాంతంలో స్కార్సెల్లాకు ఘన చరిత్రే ఉంది. పాతికేళ్ల కెరీర్లో స్కార్సెల్లా వందకు పైగా హత్య కేసుల్లో నిందితులను దోషులుగా నిరూపించ గలిగాడు. అయితే, వీటిలో చాలా కేసులు అక్రమంగా బనాయించినవేననే ఆరోపణలు గుప్పుమనడంతో బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ కెన్నెత్ థాంప్సన్ నేతృత్వంలో ఏర్పడిన రివ్యూ కమిషన్ ఆ కేసులన్నింటినీ తిరగదోడింది. డెబ్బయి కేసులను పునఃసమీక్షకు స్వీకరించింది. వాటిలో డెరిక్ హామిల్టన్ కేసు కూడా ఒకటి.
ఇదీ కేసు...
బ్రూక్లిన్‌లోని బెడ్ ఫోర్డ్ స్టైవిసెంట్ ప్రాంతంలో 1991లో నతానియేల్ క్యాష్ అనే యువకుడిని అతడి ఇంటి వద్దనే ఎవరో కాల్చి చంపారు. అప్పుడక్కడ క్యాష్ గర్ల్‌ఫ్రెండ్ జూవెల్ స్మిత్ మాత్రమే ఉంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. స్కార్సెల్లా ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలైంది. ఇవేవీ తెలియని డెరిక్.. కనెక్టికట్‌లోని సెలూన్‌కు వెళ్లాడు. ఇంతలోనే ఊడిపడ్డాడు స్కార్సెల్లా. అతడిని ఈడ్చుకొచ్చి పోలీసు వాహనం లోకి ఎక్కించాడు. కోర్టులో ప్రత్యక్ష సాక్షిగా జూవెల్ స్మిత్‌ను ప్రవేశపెట్టారు. తన బాయ్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపేసింది అతడేనని చెప్పిందామె. ఇంకేం, డెరిక్‌కు శిక్ష పడింది.
అయితే, మూడేళ్ల కిందట పోలీసుల బలవంతం వల్లే తాను అబద్ధపు సాక్ష్యం చెప్పానంటూ జూవెల్ ఒక దినపత్రికకు చెప్పింది. దాంతో డెరిక్ లాయర్లు పునర్విచారణకు అప్పీలు దాఖలు చేశారు. కోర్టు డెరిక్‌ను పెరోల్‌పై విడుదల చేసింది. పెరోల్లో ఉన్న కాలంలోనే డెరిక్ ఒక ఉద్యోగంలో చేరాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాడు. రెండేళ్ల కిందట ఒక కూతురికి తండ్రి కూడా అయ్యాడు. మూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఏడాది జనవరిలో నిర్దోషిగా విడుదలయ్యాడు.
చివరికి నిజమే గెలిచింది!
Published Sun, Aug 2 2015 4:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్‌తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు?
హైదరాబాద్‌పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement