రారండోయ్‌ | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Feb 25 2019 12:02 AM

Telugu Literature Events In Andhra Pradesh And Telangana - Sakshi

  • విరసం ఆధ్వర్యంలో జి.ఎన్‌.సాయిబాబా కవిత్వం ‘నేను చావును నిరాకరిస్తున్నాను’, వరవరరావు ‘సహచరులు’ ఆవిష్కరణ సభలు ఫిబ్రవరి 25–28న వరుసగా కర్నూలు, కరీంనగర్, విజయవాడ, వరంగల్‌లో జరగనున్నాయి.
  • నక్క హరిక్రిష్ణ వ్యాస సంపుటి పరామర్శ ఆవిష్కరణ ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: రచనల చెరువు సాహిత్య వేదిక.
  • డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి పంచమ వర్ధంతి సభ ఫిబ్రవరి 28న ఉదయం 10 గంటలకు కడపలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో కేంద్రంలోని  సమావేశ మందిరంలో జరగనుంది. వక్త: శలాక రఘునాథ శర్మ.
  • రావి రంగారావు కవిత్వం ‘గుండెలో నదులు నింపుకొని’ ఆవిష్కరణ మార్చి 1న సాయంత్రం 6 గంటలకు గుంటూరులోని బృందావన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఆవిష్కర్త: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌. నిర్వహణ: అమరావతి సాహితీ మిత్రులు.
  • సాహిత్య అకాడెమీ, గాంధీక్షేత్రం నిర్వహణలో తెలుగు సాహిత్యం, సంస్కృతి – గాంధీ ప్రభావం అంశంపై రెండ్రోజుల సదస్సు మార్చ్‌ 2, 3 తేదీల్లో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరగనుంది. ఐదు సెషన్ల ఈ కార్యక్రమంలో పలువురు పత్ర సమర్పణ చేస్తారు.
  • జాతీయ సాహిత్య పరిషత్తు–సిద్దిపేట వారి 32వ వార్షికోత్సవ సభ సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మార్చ్‌ 3న మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ముఖ్య అతిథి: ఎ.వి.రామారావు.  పుస్తకావిష్కరణలు, పురస్కారాల ప్రదానం ఉంటాయి.
  • తానా– మంచి పుస్తకం వారి 10 పిల్లల బొమ్మల పుస్తకాల ఆవిష్కరణ, బహుమతుల ప్రదానం మార్చి 3న సాయంత్రం 4:30కు ఎం.బి. విజ్ఞాన కేంద్రం, రాఘవయ్య పార్కు దగ్గర, విజయవాడలో జరగనున్నాయి. ఆవిష్కర్త: వాసిరెడ్డి రమేష్‌బాబు; ప్రదానం: ఎన్‌.మంగాదేవి.
  • ప్రసాద్‌ తుమ్మా కవిత్వం అంతరంగాలు ఆవిష్కరణ మార్చి 3న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరగనుంది. నిర్వహణ: కవిసంగమం.
  • మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇతివృత్తంతో కథలు, కవితల పోటీని డి.ఎస్‌.సిద్ధార్థ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ, గుంటూరు నిర్వహిస్తోంది. వివరాలకు: 8008189979

Advertisement
Advertisement