నన్నడగొద్దు ప్లీజ్‌ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Sat, Sep 23 2017 1:32 AM

love doctor solve the problems

హాయ్‌ బ్రో! ఐ యామ్‌ ఏ లవ్‌ ఫెల్యూర్‌. ఐ డోంట్‌ హ్యావ్‌ ఇంటరెస్ట్‌ ఇన్‌ లవ్‌ ఆండ్‌ వుమెన్‌ ఆజ్‌ వెల్‌. దట్స్‌ ద సెకండరీ థింగ్‌. బట్‌ మై రూమ్‌మేట్‌ హ్యాజ్‌ ఏ లవర్‌ ఫ్రమ్‌ పాస్ట్‌ 9 ఇయర్స్‌. దే బోత్‌ లవ్‌ ఈచ్‌ అదర్‌ డీప్లీ దట్‌ దే ఇన్స్‌పైర్‌డ్‌ మీ ఏ లాట్‌. హి ఇన్స్‌పైర్‌డ్‌ మీ విద్‌ దీస్‌ లైన్స్‌ వెన్‌ టాకింగ్‌ ఎబౌట్‌ హిజ్‌ లవ్‌. ‘‘1. ఐ విల్‌ మ్యారీ ఓన్లీ దట్‌ పర్సన్‌. ఇఫ్‌ షీ ఈజ్‌ నాట్‌ దేర్, ఐ విల్‌ నెవర్‌ మ్యారీ. 2. ఇఫ్‌ షీ ఈజ్‌ మ్యారీడ్‌ ఆండ్‌ జస్ట్‌ వాక్‌ టువార్డ్స్‌ మీ ఆండ్‌ ఆస్క్, ‘విల్‌ యూ మ్యారీ మీ?’ ఐ విల్‌ మ్యారీ ఈవెన్‌ ఇఫ్‌ షీ హ్యాజ్‌ కిడ్స్‌ ఆండ్‌ దోస్‌ కిడ్స్‌ ఆర్‌ మైన్‌. 3. టిల్‌ నవ్‌ ఐ డింట్‌ టచ్‌ హర్‌ సిన్స్‌ 9 ఇయర్స్‌’’ ద ప్రాబ్లమ్‌ విత్‌ దెయిర్‌ లవ్‌ ఇజ్, ద బాయ్‌ ఈజ్‌ ముస్లిమ్‌ ఆండ్‌ ద గర్ల్‌ ఈజ్‌ ఏ హిందు. దెయిర్‌ ఫీల్డ్స్‌ ఆర్‌ అల్సో డిఫరెంట్‌. షీ ఈజ్‌ డూయింగ్‌ ఏ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ విత్‌ హై పే. ద గయ్‌ ఈజ్‌ జస్ట్‌ డూయింగ్‌ యాన్‌ ఇంటర్న్‌షిప్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌. షీ ఈజ్‌ రెడీ టు చేంజ్‌ హర్‌ రిలీజియన్‌ ఆల్సో. నవ్‌ టెల్‌ మీ హావ్‌ టు మేక్‌ దెయిర్‌ పేరెంట్స్‌ హ్యాపీ ఆండ్‌ మేక్‌ దెమ్‌ అగ్రీ దెయిర్‌ లవ్‌. ప్లీజ్‌ సెండ్‌ ది ఆన్సర్‌ టు మై మెయిల్‌ ఐడీ ఆల్సో, యాజ్‌ ఐ మే మిస్‌ సీయింగ్‌ న్యూస్‌పేపర్‌ యాజ్‌ ఐ యామ్‌ స్టేయింగ్‌ ఇన్‌ చెన్నై ఫర్‌ సమ్‌ డేస్‌. – షేక్‌

ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు! ‘అది కాదు సార్‌ విషయం!!’ నైన్‌ ఇయర్స్‌ లవ్లో ఒక్కసారి కూడా ఎకిలి పనులు చెయ్యలేదు! ‘అది గ్రేట్‌ కానీ, అది కాదు సార్‌ విషయం!!’ పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటాడు! ‘బాగుంది కానీ అది కాదు సార్‌ విషయం!!’ అమ్మాయి పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాక కూడా తను కావాలనుకుంటే ఆ పిల్లలను సైతం తన పిల్లలుగా చూసుకుంటానంటున్నాడు! ‘అర్జున్‌ రెడ్డి సినిమా స్టోరీ సార్‌.. అయినా అది కాదు సార్‌ విషయం!!’ అమ్మాయి ఇంటెలిజెంట్‌ మనోడు నాలాగా వీక్‌ అయినా అమ్మాయి రెడీ! ‘అమ్మాయిలు ప్రేమను చూస్తారు సార్‌ పొజిషన్‌ కాదు.. అయినా అది కాదు సార్‌ విషయం!!’

ఇప్పుడు పేరెంట్స్‌ని ఎలా కన్విన్స్‌ చెయ్యాలి అన్నది ప్రాబ్లమ్‌! ‘అవును సార్‌ కానీ అది కాదు సార్‌ విషయం!!’ ప్రేమ గొప్పదయితే మతాలు, కులాలు, ఆస్తులు, అంతస్తులు అడ్డం రావు.. పేరెంట్స్, సమాజం కోరుకునేది ఒక్కటే కపుల్‌ హ్యాపీగా ఉండాలని! ‘కరెక్ట్‌ సార్‌.. కానీ అది కాదు సార్‌ విషయం!!’ ఎహే.. ఏంటి విషయం? ‘రాసినోడు లవ్‌ ఫెయిల్యూర్‌ క్యాండిడేట్‌ సార్‌!!’ అయితే..? ‘అసలు లవ్‌ ఇంట్రెస్ట్‌ లేదంట సార్‌!!’
అయితే..? ‘మరి ఎందుకు సార్‌ ఇతరుల లవ్‌లో అంత ఇంట్రెస్ట్‌.. అది సార్‌ విషయం!!’ ఐతే ఈ ఆన్సర్‌ మెయిల్‌ చెయ్యొద్దు చదివితే మళ్లీ అన్‌నెసెసర్లీ ప్రేమలో ఇంట్రెస్ట్‌ పుట్టుద్దేమో! ‘ఎస్‌ సార్‌!!’


- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement