మీకు తెలుసా..? | Sakshi
Sakshi News home page

మీకు తెలుసా..?

Published Mon, Oct 5 2015 12:20 AM

మీకు తెలుసా..?

{పపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న దంపతుల్లో 19 శాతం మంది ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన వాళ్లేనట!
{పస్తుతం ఇంటర్నెట్‌లో అందరూ మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉపయోగిస్తున్నారు. కానీ వీటన్నింటి కంటే ముందే మొసైక్ అనే వెబ్ బ్రౌజర్ ఉండేది. అది 1993 నుంచి 1997 వరకు వాడుకలో ఉంది.
మొదటి అయిదేళ్లలోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. గతంలో ఆ సంఖ్యను చేరడానికి టీవీకి 13 ఏళ్లు పట్టింది.
ఇంటర్నెట్ యూజర్లు ఒక్క నిమిషానికి పంపగల ఇ-మెయిళ్లు 204 కోట్లు.
1993 వరకు వరల్డ్ వైడ్ వెబ్ లో కేవలం 623 వెబ్‌సైట్లు మాత్రమే ఉన్నాయి.
ఒక్కరోజు ఇంటర్నెట్ ఆగిపోతే 19,600కోట్ల ఇ-మెయిల్స్, 300కోట్ల గూగుల్ సెర్చులు వెయిటింగ్‌లో ఉండాల్సిందే.
{పస్తుతం జనాలను బిజీగా చేసిన ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్కులు గత అయిదేళ్ల నుంచే బాగా ప్రాచుర్యం పొందాయి.
ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్ డేటింగ్ చేసేవాళ్లు ఏడాదికి సుమారు 243 డాలర్లు ఖర్చు చేస్తారట!
జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయ్యేందుకు పట్టిన అతి తక్కువ సమయంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డు 1.16 సెకన్లు.
గూగుల్ యాడ్ వర్డ్స్ ప్రకటనల్లో అత్యంత ఖరీదైన పదం ‘ఇన్సూరెన్స్’.
ఫేస్‌బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఐడీ నెం ‘4’.
 
 

Advertisement
Advertisement