తమ్మవరం విద్యార్థికి గోల్డ్‌ మెడల్‌ | Sakshi
Sakshi News home page

తమ్మవరం విద్యార్థికి గోల్డ్‌ మెడల్‌

Published Tue, Nov 1 2016 8:02 PM

తమ్మవరం విద్యార్థికి గోల్డ్‌ మెడల్‌

 
మేదరమెట్ల: కేరళ రాష్ట్రంలో గత నెలలో నిర్వహించిన సౌత్‌ జోన్‌ నేషనల్‌ త్రోబాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో విశేష ప్రతిభ కన బరిచిన మండలంలోని తమ్మవరం గ్రామానికి చెందని గుర్రాల ఆనందబాబు గోల్డ్‌మెడల్‌ సాధించాడు.
 
ప్రకాశం జిల్లా త్రోబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన సౌత్‌జోన్‌ సెలక్షన్‌లలో ఎంపికైన ఆనందబాబు ఈ పోటీల్లో పాల్గొన్నాడు. గోల్డ్‌మెడల్‌ సాధించిన ఆనందబాబును జిల్లా త్రోబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పీఎం నరశింహరావు అభినందించారు.    

Advertisement
Advertisement