రెండో పెళ్లి చేసుకున్న ఎస్ఐపై వేటు | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి చేసుకున్న ఎస్ఐపై వేటు

Published Sat, Nov 5 2016 1:34 PM

si suspended in second marriage controversy

కరీంనగర్: భార్య ఉండగానే మరో యువతిని పెళ్లి చేసుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ త్రీటౌన్ ఎస్‌ఐగా పని చేస్తున్న రఫీక్ ఖాన్ భార్య ఉండగానే మరో యువతి(డాక్టర్)ని పెళ్లి చేసుకున్నాడు. ఈ అంశంపై అతని భార్య పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.

విచారణ చేపట్టిన పోలీసులు నివేదికను ఉన్నాతాధికారులకు అందించారు. దీంతో శనివారం రఫీక్‌ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు.
 

Advertisement
Advertisement