హైదరాబాద్‌లో హెల్మెట్ ఇక తప్పదు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హెల్మెట్ ఇక తప్పదు

Published Fri, Sep 4 2015 12:28 AM

హైదరాబాద్‌లో హెల్మెట్ ఇక తప్పదు - Sakshi

హైదరాబాద్: కొత్తగా ద్విచక్ర వాహనం కొంటున్నారా?....అయితే హెల్మెట్ కూడా తప్పకుండా కొనుక్కోండి. మీ కొత్త వాహనం ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కావాలంటే హెల్మెట్ ఉండాల్సిందే. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ ధరించడాన్ని రవాణాశాఖ తప్పనిసరి చేసింది.

 

శుక్రవారం నుంచి ఈ నిబంధనను అమల్లోకి రానుంది. రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్న రహదారి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. వివిధ రూపాల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతారు. అనంతరం పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు జేటీసీ తెలిపారు.

Advertisement
Advertisement