కన్న కూతురి వద్దే వడ్డీ వసూలు చేస్తూ.. | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 17 2018 12:55 PM

 Teacher Harasses Daughter for money - Sakshi

సాక్షి, విజయవాడ : కన్నతండ్రే డబ్బుకోసం కర్కోటకుడిగా మారాడు. కూతురికి రూ. 5 లక్షలు అప్పు ఇచ్చి ఏకంగా రూ. 15 లక్షలు వడ్డీ వసూలు చేశాడు. అంతటితో అతని ధనదాహం తీరలేదు. మరో ఐదు లక్షల రూపాయలు చెల్లించాలంటూ కూతురిని డిమాండ్‌ చేశాడు. అందుకు కూతురు నిరాకరించడంతో కర్కోటకుడిగా మారి.. కూతురికి చెందిన నాలుగున్నర ఎకరాల్లో పంటపొలం వేయకుండా అడ్డుపడ్డాడు. కన్నతండ్రే ఇలా డబ్బు కోసం తమను వేధిస్తుండటంతో కూతురు తాజాగా కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని గంపలగూడెం తునికిపాడుకు చెందిన కిలారు హన్మంతరావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తన తండ్రి అయిన ఆయన తనకు రూ. 5 లక్షలు అప్పు ఇచ్చాడని, దీనికి వడ్డీ పేరిట రూ. 15లక్షలు వసూలు చేశాడని, అయినా ఇంకా రూ. 5 లక్షలు ఇవ్వాలని తమను వేధిస్తున్నాడని హన్మంతరావు కూతురు చంద్రలేఖ మంగళవారం జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతానికి ఫిర్యాదు చేశారు. తాము మరో ఐదు లక్షలు ఇవ్వకపోవడంతో తమ నాలుగు ఎకరాల భూమిలో పంటలు వేయకుండా అడ్డుకుంటున్నాడని ఆమె తెలిపారు. దీంతో అధిక వడ్డీ వసూలు చేసిన హన్మంతరావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement
Advertisement