నడిరోడ్డుపై ఉన్మాది వీరంగం.. బ్లేడ్‌తో దాడి | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 12:27 PM

A Man Attacked By Auto Driver With Blade - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎర్రగడ్డ, అత్తాపుర్‌ హత్యా ఘటనలు మరవకముందే.. నగరంలో నడిబొడ్డున అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. అందరు చూస్తుండగానే ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. ఓ ఆటోడ్రైవర్‌పై బ్లేడ్‌తో విచక్షణారహితంగ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఆదివారం చాదఘాట్‌లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆటోడ్రైవర్‌ను మూసఖాన్‌గా గుర్తించిన పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement
Advertisement