సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు ఆపొద్దు: ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ | Sakshi
Sakshi News home page

సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు ఆపొద్దు: ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌

Published Mon, May 25 2020 1:37 PM

Don’t stop your fund SIPs - Sakshi

ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లను ఆపవద్దని మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం కోల్పోవడం, నెలవారి ఆదాయం గణనీయంగా తగ్గినప్పుడు మాత్రమే సిప్‌లలో ఇన్వెస్ట్‌మెంట్లు ఆపాలని వారు సూచిస్తున్నారు. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో తెలియక, ప్రస్తుత ఆర్థిక అనిశ్చితిలో చాలా మంది  సిప్‌ఇన్వెస్టర్లు .. వేతనాల్లో కోత, నెలవారి ఆదాయాల్లో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారు మాత్రమే ఫండ్‌ హౌస్‌ అధికారిక వెబ్‌సైట్‌గానీ, అధికారిక ఈ-మెయిల్‌ లోకి వెళ్లి తమ సిప్‌ను 3-6 నెలలపాటు వాయిదా వేయాలని కోరుతూ, ప్రారంభ, ముగింపు తేదీలను చెబుతూ పోలియో నంబరుతో రిజిస్టర్‌ చేసుకోవాలని మీరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ స్వరూప్‌ మొహంతి వెల్లడించారు. ఎవరికైతే త్రీవ ఆర్థిక సమస్యలు ఉన్నాయో వారు మాత్రమే సిప్‌ను నిలిపివేసే ఆప్షన్‌ ఎన్నుకోవాలన్నారు. ఈక్విటీ మార్కెట్లు దెబ్బతిన్నప్పటికీ సిప్‌ ఇన్వెస్టర్లకు  ఎటువంటి నష్టం లేకుండా  దీర్ఘకాలంలో పెట్టుబడి మొత్తం నగదు వెనక్కి వస్తుందని తెలిపారు. ఫైనాన్షియల్‌ ప్లానర్లు ఈ సదుపాయాన్నితొందరపాటుతో వినియోగించరాదని ఆయన హెచ్చరిస్తున్నారు. నెలవారీ ఆదాయంలో కోత ఉంటేనే సిప్‌ను నిలిపివేసే ఆప్షన్‌ తీసుకోవాలని స్వరూప్‌ స్పష్టం చేశారు. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా మార్కెట్లు వోలటాలిటీకి లోనవుతున్నాయి. దాన్ని చూసిన కొంతమంది ఇన్వెస్టర్లు సిప్‌లను ఆపాలని చూస్తున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. మార్కెట్లు పతనమైనప్పుడు సిప్‌లలో పెట్టుబడులు ఉపసంహరించుకుంటే కనిష్ట ధర వద్ద సగటు చేసే ప్రయోజనం కోల్పోతారని, తద్వారా ఇన్వెస్టర్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరని ఫైనాన్షియల్‌ ప్లానర్‌ విరాల్‌ భట్‌ అంటున్నారు. 

Advertisement
Advertisement