వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం

YSRCP President YS Jagan Mohan Reddy Has Been Reached To Kadapa - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం కడప చేరుకున్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ సుమారు రాత్రి 7.30 గంటల సమయానికి ఇంటికి చేరారు. దారి పొడవునా ఆయనను కలిసేందుకు అభిమానులు బారులు తీరారు. రేపు, మర్నాడు వైఎస్‌ జగన్‌, పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. వారు చెప్పే సమస్యలను సావధానంగా విననున్నారు. రేపు సాయంత్రం పులివెందులలో ఇఫ్తార్‌ విందుకు హాజరు కానున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top