రైవాడ నీళ్లు రైతులకే..

Raivada Water Only For Farmers YS Jagan - Sakshi

పోలవరం పూర్తి చేసి రైతులకు మేలు చేస్తా

చక్కెర ఫ్యాక్టరీలకు చేయూతనిస్తా.. అన్ని విధాలా ఆదుకుంటా..

కె.కోటపాడు సభలో వైఎస్‌ జగన్‌ వరాల జల్లు

సాక్షి, విశాఖపట్నం: ‘మహానేత మాదిరిగానే ప్రతి రైతుకు మేలు చేస్తా.. నాన్న కలలు కన్నట్టుగా ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుటుంబాలకు చేయూతనిస్తా’నంటూ జననేత ప్రజల హృదయాలను దోచుకున్నారు. మహానేత పాలన తర్వాత తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లా రైతాంగానికి ఆయన మళ్లీ ఆశల ఊపిరిలూదారు. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడమే కాదు.. సహకార రంగంలో ఫ్యాక్టరీలకు జవసత్వాలు కల్పిస్తామని భరోసానిచ్చిన జగన్‌మోహనుడు మన ప్రభుత్వం రాగానే రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తానంటూ అభయమిచ్చారు. మాడుగుల నియోజక వర్గం కె.కోటపాడు మూడు రోడ్ల కూడలిలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభలో రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఓ పక్క చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ మరో వైపు రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు చేసే ఎన్నో విషయాలను ప్రకటించారు.

రైతన్నకే ప్రాధాన్యం
‘రైవాడ రిజర్వాయర్‌ నీటిని దశాబ్దాలుగా విశాఖకు తరలిస్తున్నారు. ఈ నీళ్లు పూర్తిగా రైతులకు అందిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. మన ప్రభుత్వం రాగానే పోలవరం పూర్తి చేసి రైవాడ నీళ్లను పూర్తిగా ఈ ప్రాంత రైతులకే దక్కేలా చేస్తా, అంతేకాదు ప్రాజెక్టు ఆయకట్టును కూడా పెంచుతాన’ంటూ వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటన రైతులకు పట్టరాని ఆనందం కలిగించింది.

చోడవరం ఫ్యాక్టరీని ఆదుకుంటా..
24 వేలమంది రైతులకు జీవనాధారమైన చోడవరం చక్కెర ఫ్యాక్టరీ ఆదుకుంటానని జననేత హామీనిచ్చారు. 2003లో చంద్రబాబు హయాంలో రూ.45 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ ఫ్యాక్టరీని వైఎస్‌ తన పాలనలో ఆధునికీకరించడమే కాదు..ఆ నష్టాలను పూడ్చి రూ.45 కోట్ల లాభాల బాట పట్టించారని, మళ్లీ చంద్రబాబు పాలనలో ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ రూ.100 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని వివరించారు. ఇలా ఫ్యాక్టరీని నష్టాల బాట పట్టిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడేనా అని ప్రశ్నించినప్పుడు మాకొద్దీ బాబు అంటూ రైతులు రెండు చేతులు ఊపుతూ బిగ్గరగా నినాదాలు చేశారు.

నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ
ప్రతి అక్కకు చెల్లమ్మను లక్షాధికారిని చేయాలన్న నాన్నగారి స్పప్నాన్ని నిజం చేస్తానని జననేత భరోసా ఇచ్చారు. బేషరతుగా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు మాట తప్పడంతో నేడు వడ్డీతో వారి అప్పు రూ.21,600 కోట్లకు చేరిందన్నారు. ఎన్నికల నాటికి వాళ్లకు ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా వారి చేతికే ఇస్తానని హామీ ఇస్తున్నానని ప్రకటించడంతో మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇసుక దోపిడీతో రోడ్లు అధ్వానం
తాను వచ్చే దారిలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ప్రజలు చెప్పిన విషయాన్ని వివరిస్తూ.. చోడవరం–దేవరాపల్లి, దేవరాపల్లి–కొత్తవలస, చోడవరం–కోటపాడు వయా గవరవరం రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పారు. అడ్డగోలుగా దోచేస్తున్న ఇసుకను ఈ రోడ్లపై అడ్డూ అదుపు లేకుండా రవాణా చేయడం వలన ఎక్కడపడితే అక్కడ గుంతలు పడ్డాయని, కనీసం వాటిని పూడ్చలేదని విమర్శించారు. మాడుగులలో మంజూరైన డిగ్రీ కళాశాలకు నాలుగేళ్లుగా భవనాలు నిర్మించలేదన్నారు.

నీరు చెట్టు పథకంలో ముసిడిపల్లి, నాగరాయిచెరువు, ఎ.కొత్తపల్లి, రెడ్డివారి పెద్దచెరువు, కొత్తచెరువుతో సహా కె.కోటపాడు మండలంలో ఉన్న చెరువులన్నీ పొక్లెయిన్లు పెట్టి తాటిచెట్లంత లోతు తవ్వేసి మట్టిని దోచుకుంటున్నారని, బిల్లులు డ్రా చేసి సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. మాడుగుల మండలం బొడ్డేరులో పెదకళ్యాణం ఆనకట్ట హుద్‌హుద్‌ తుఫాన్‌కు తెగిపోతే నేటికీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షే మ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సెక్రటేరియట్లు ఏర్పాటు చేసి ఆ గ్రామంలోని 10మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు వీటి ద్వారా ఎలాంటి సిఫా ర్సుల్లేకుండా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే ఏది కావాలన్నా ఉచితంగా అందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు

19-11-2018
Nov 19, 2018, 08:58 IST
సాక్షి, కురుపాం(విజయనగరం): రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌...
19-11-2018
Nov 19, 2018, 07:21 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనం కోసం వేసిన తొలి అడుగు వేలాది కిలోమీటర్లు దాటినా అలసిపోనంటోంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చి...
19-11-2018
Nov 19, 2018, 07:17 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర...
19-11-2018
Nov 19, 2018, 07:15 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర...
19-11-2018
Nov 19, 2018, 07:13 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లాలో 26 మండలాల్లో  కరువు ఏర్పడటానికి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం...
19-11-2018
Nov 19, 2018, 07:11 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించటమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌...
19-11-2018
Nov 19, 2018, 07:09 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు పేరు చెప్పగానే కురుపాం నియోజకవర్గంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రైతులు, ప్రజలకు...
19-11-2018
Nov 19, 2018, 07:08 IST
విజయనగరం , ప్రజాసంకల్పయాత్ర బృందం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశ...
19-11-2018
Nov 19, 2018, 06:59 IST
విజయనగరం ,ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతుండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు...
19-11-2018
Nov 19, 2018, 06:58 IST
విజయనగరం: అన్నా 15 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లుగా పని చేస్తున్నాం.  మమ్మల్ని...
19-11-2018
Nov 19, 2018, 06:56 IST
విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: అన్నా నా పేరు లింగారెడ్డి వీరప్రతాపరెడ్డి. నేను వైఎస్సార్‌ కడప జిల్లా వీఎన్‌పల్లి మండలం, బుచ్చిరెడ్డి...
19-11-2018
Nov 19, 2018, 06:54 IST
విజయనగరం: ‘అయ్యా ! మేం తోటపల్లి నిర్వాసితులం. పార్వతీపురం పక్కనే బంటువానివలసలో నివసిస్తున్నాం. కన్నతల్లి లాంటి ఊరును, భూములను వదిలేసి...
19-11-2018
Nov 19, 2018, 06:50 IST
విజయనగరం: రెల్లి కులస్థులకోసం ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని పార్వతీపురానికి చెందిన రెల్లికులస్తులు జననేత జగన్‌మోహన్‌రెడ్డిని వేడుకున్నారు. తమ కులాన్ని...
19-11-2018
Nov 19, 2018, 04:32 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సడలని సంకల్పం, ఒడిదుడుకులను లెక్క చేయని పట్టుదల, ప్రజల హృదయాల్లో...
19-11-2018
Nov 19, 2018, 03:35 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,261.6 కి.మీ  18–11–2018, ఆదివారం  తోటపల్లి రిజర్వాయర్‌ ప్రాంతం,  విజయనగరం జిల్లా బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు..  నేటితో ప్రజా సంకల్ప...
18-11-2018
Nov 18, 2018, 19:26 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజు...
18-11-2018
Nov 18, 2018, 13:47 IST
చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. వజ్రసంకల్పంతో ముందడుగు వేస్తున్నారు వైఎస్‌ జగన్‌. ప్రతి గుండెలో తాను కొలువై...
18-11-2018
Nov 18, 2018, 12:08 IST
సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన...
18-11-2018
Nov 18, 2018, 09:24 IST
సాక్షి, పార్వతీపురం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
18-11-2018
Nov 18, 2018, 06:50 IST
గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో అభివృద్ధి చేయడం లేదు. చాలా గ్రామాల్లో కనీసం మౌలిక...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top