సీఎం రమ్మన్నారు, అందుకే వచ్చా: లగడపాటి

చంద్రబాబుతో లగడపాటి సమావేశం


అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి రమ్మన్నారు, అందుకే వచ్చానని అన్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. తాను చంద్రబాబును వ్యక్తిగతంగానే కలిశానని, ఏం మాట్లాడానో బయటికి చెప్పలేనన్నారు.


పవర్ ప్లాంట్‌ ఒప్పందాల గురించి మాట్లాడారా అని మీడియా ప్రశ్నించగా, వ్యక్తిగతంగానే కలిశానంటూ సమాధానం దాటవేశారు.  రాజకీయాలకు దూరం అని గతంలోనే చెప్పాను...దానికే కట్టుబడి ఉన్నానని లగడపాటి స్పష్టం చేశారు. సీఎంతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించీ మాట్లాడలేదని తెలిపారు. రాజకీయ అంశాలు అయితే ఇంట్లోనో...పార్టీ కార్యాలయంలోనే కలిసే వాడినని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమని అన్నారు. కాగా గతంలోనూ లగడపాటి ....చంద్రబాబుతో సమావేశం అయిన విషయం తెలిసిందే.

Back to Top