-
ఇంటి పేరు మార్చుకుంటున్నారా..?
వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు చూస్తుంటాం. ఆమెకు, ఆమె సంతానానికి సహజంగానే భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. అప్పటి వరకు తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసిన ఆమె, తన విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్లో అదే పేరును కలిగి ఉంటుంది. మరి పెళ్లి తర్వాత ముఖ్యమైన పత్రాల్లో భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా..? వద్దా..? ఇదొక పెద్ద సందేహం. చాలా మంది ఈ విషయంలో డోలాయమాన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. వివాహానంతరం తండ్రి ఇంటి పేరుతో కొనసాగేందుకు అందరూ అంగీకరించకపోవచ్చు. భర్త అంగీకరించినా, మార్చుకోవడం సులభమేమీ కాదు. ఇందులోని సాధక బాధకాలను పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో సులభంగా తేల్చుకోవచ్చు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కేవలం ఆధార్‌లో మాత్రమే ఇంటి పేరును మార్చుకుని వదిలివేయడం సరైనది కాదు. విద్యార్హతలు సహా చట్టబద్ధమైన అన్ని పత్రాలు, పెట్టుబడుల డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కేవలం పాన్, ఆధార్‌లోనే ఇంటి పేరు మార్చుకుంటే, అది ఎన్నో ఇక్కట్లకు దారితీయవచ్చు. ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతాల్లోని పేర్లకు, పాన్, ఆధార్‌లోని పేర్ల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఆయా ఖాతాల నుంచి నిధులను వెనక్కి తీసుకోవాలంటే.. పేరును అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం మరోసారి కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయక తప్పదు. పేర్ల అప్డేట్ కోసం అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావచ్చు. ‘‘వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఈ విషయంలో లాభ, నష్టాలు రెండింటినీ పరిశీలించుకోవాలి. పేరును మార్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే కుటుంబం అంతటికీ ఒకే విధమైన గుర్తింపు, ఏకరూపత ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు శ్రమ పడాల్సి రావడమే ప్రతికూలం’’అని ఫిన్‌ఎడ్జ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా భారతి వివరించారు. పెళ్లయిన తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ‘అలగ్ అండ్ కపూర్ లా ఆఫీసెస్’ (న్యాయ సేవల సంస్థ) పార్ట్నర్ సోనాల్ అలఘ్ పేర్కొన్నారు. గతంలోని పేరుకు, ప్స్ట్రేతుత పేరుకు మధ్య మార్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎన్నో పరిశీలనలకు తోడు వృత్తిపరమైన ధ్రువీకరణలు అవసరం పడతాయన్నారు. భర్త ఇంటి పేరు అప్పటి వరకు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకుంటున్నట్టు అయితే చట్టబద్ధంగా గుర్తింపును మారుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అధికారిక రికార్డుల్లో పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాలనాపరమైన పెద్ద చిక్కుగా, సవాలుతో కూడుకున్నదిగా అభివర్ణించారు సోనాల్ అలఘ్. ‘‘దీనికి తోడు విద్యా, ప్రభుత్వ సంస్థల్లో పేరు మార్పునకు సంబంధించిన కఠిన ప్రక్రియ కష్టాలను మరింత పెంచుతుంది. దీంతో గుర్తింపు సమస్యలు ఎదురుకావచ్చు’’అని ఆమె పేర్కొన్నారు. మహిళ ఇంటి పేరును మార్చుకుంటుంటే, అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేసుకోవాలని దీపికా భారతి సూచించారు. కేవలం కొన్నింటిలోనే మార్పు చేసుకుని వదిలేస్తే, విదేశాలకు వెళ్లే సందర్భాల్లో, పెట్టుబడుల సమయంలో, లేదంటే నామినీగా ఉండి పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆస్తులు తదితర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పాలసీల్లో పేరులో మార్పు చేయకపోతే, గుర్తింపును నిరూపించుకునేందుకు లేదా ఆయా ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కరంజ్వాలా అండ్ కో పార్ట్నర్ మేఘనా మిశ్రా పేర్కొన్నారు. ఆస్తి పత్రాల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకున్న ప్రతి ఒక్కరూ.. తమ పేరిట ఉన్న భౌతిక, ఆర్థిక ఆస్తులు అన్నింటిలోనూ ఆ మేరకు సవరణ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కసారి ఆధార్, పాన్‌లో కొత్త ఇంటి పేరు ఆధారంగా సవరణ చేసుకుంటే, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల్లో మార్చుకోవడం సులభతరం అవుతుందని భారతి తెలిపారు. ఉద్యోగం చేసే చోట అధికారిక రికార్డుల్లోనూ ఇంటి పేరులో మార్పు చేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించొచ్చు. మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? నేటి రోజుల్లో దాదాపు అధిక శాతం మహిళలు పెళ్లయిన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటున్నారు. భర్త ఇంటి పేరుకు మారిపోవడం వల్ల గుర్తింపు సులభంగా ఉంటుందని మిశ్రా తెలిపారు. సామాజికంగా ఒకే కుటుంబం అన్న భావన, కుటుంబంలో ఐక్యతకు ఇది అనుకూలిస్తుందన్నారు. పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కీలక పత్రాల్లో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ (వివాహ ధ్రువీకరణ) సమరి్పంచాల్సి వస్తుంది. పాస్ పోర్ట్ ఆఫీస్, ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి నిర్ధేశిత దరఖాస్తుకు అనుబంధంగా వివాహ ధ్రువీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలి. మ్యారేజ్ సర్టిఫికెట్‌తోపాటు గుర్తి్తంపు, చిరునామా ధ్రువీకరణ, పేరు మార్పునకు సంబంధించి అఫడవిట్ అవసరమవుతాయని మిశ్రా తెలిపారు. ‘‘నిర్ధేశిత మార్పునకు సంబంధించి చటబద్ధమైన ప్రక్రియలకు కట్టుబడి ఉండడం కీలకం. ఇక్కడ చెప్పినవన్నీ ప్రాథమికంగా సమర్పించాల్సినవి. విడిగా ఆయా డాక్యుమెంట్లలో మార్పులకు గాను సమరి్పంచాల్సినవి వేరేవి కూడా ఉండొచ్చు’’అని మిశ్రా పేర్కొన్నారు. పదో తరగతి మెమో చాలా వాటికి పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో పేరు మార్చుకోవడం కష్టమేనంటున్నారు మేఘన మిశ్రా. ‘‘సీబీఎస్ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లలో పేర్ల మార్పునకు అనుమతించడం లేదు. పాన్, పాస్‌పోర్ట్‌కు టెన్త్ సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. పాన్/ఆధార్‌కు, సీబీఎస్ఈ పదో తరగతి సర్టిఫికెట్లో పేరుకు వ్యత్యాసం ఉంటే బ్యాంక్ ఖాతా లేదా పాస్‌పోర్ట్ తీసుకునే విషయంలో ధ్రువీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. వివాహానంతరం వృత్తిపరమైన విద్యార్హతల డాక్యుమెంట్లు, కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు, అంతకుముందు డాక్యుమెంట్లలో మాదిరే ఉండాలి’’అని మిశ్రా వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఏక్తా రాయ్ అభిప్రాయం భిన్నంగా ఉంది. స్కూల్ సర్టిఫికెట్లు అన్నవి ఒక నిరీ్ణత కాలం వరకు పుట్టిన తేదీకి ధ్రువీకరణలుగా కొనసాగుతాయి. ఇతర కీలక డాక్యుమెంట్లు అయిన పాన్, ఆధార్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇంటి పేరును అప్డేట్ చేసుకున్న తర్వాత, స్కూల్ సర్టిఫికెట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వివాహానంతరం మహిళ పాన్ లేదా ఆధార్‌లో పేరు మార్చుకునేట్టు అయితే లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు అయితే తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని, వివాహ రిజిస్ట్రేటేషన్ సర్టిఫికెట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా మేజి్స్ట్రేట్ నుంచి పాఠశాల సర్టిఫికెట్లలో ఇంటి పేరు మార్పును ధ్రువీకరిస్తున్నట్టు అటెస్టేషన్ తీసుకున్నా అది కూడా పరిగణనలోకి వస్తుంది’’అని ఏక్తా రాయ్ తెలిపారు. ఆస్తుల క్లెయిమ్ కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు. కుమార్తెలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే పేర్కొంటారు. వీలునామా రాసిన వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చే నాటికి మహిళలు వివాహాలు చేసుకుని, భర్త ఇంటి పేరుకు మారి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వీలునామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాపర్టి, యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లలోని ఇంటి పేరు ఒకే మాదిరిగా ఉండకపోతే సవాళ్లు ఎదురవుతాయని ఏక్తారాయ్ అంటున్నారు. వీలునామాలోని పేరుకు, ప్స్ట్రేతుతం మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే, అదనపు రుజువులు, డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుందని సోనాల్ అలఘ్ తెలిపారు. మహిళ ఇంటి పేరు మార్పు వెనుకనున్న అంశాలను కోర్టులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అందుకు సంబంధించి సహేతుక ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, దాంతో ఆస్తుల బదిలీ సాఫీగా పూర్తవుతుందని సూచించారు. వీసాకు దరఖాస్తు ‘‘వీసాలో పేరు అప్డేట్ చేసుకోవడం లేదంటే భాగస్వామి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న భిన్నమైన కుటుంబ నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాల్లో గుర్తించేందుకు ఎన్నో రకాల రుజువులు సమరి్పంచాల్సి రావచ్చు. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మారిన పేరుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని భావించే వారికి ఈ సవాలు ఎదురవుతుంది’’అని అలఘ్ అంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, అప్పుడు వివాహ స్థితిని తెలిపే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇది వీసా జారీని ఆలస్యం చేయవచ్చు. అందుకే పెళ్లి తర్వాత పాస్‌పోర్ట్‌లో భర్త ఇంటి పేరు ప్రతిఫలించేలా మార్పు చేసుకోవాలని మిశ్రా సూచించారు. దీనివల్ల ధ్రువీకరణ సమస్యలు తక్కువగా ఉంటాయన్నారు. పేరు మార్చుకోకపోతే..? వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించే మహిళలూ కొందరు ఉన్నారు. అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును పేర్కొనే సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. కనుక తనకు, తన భర్తకు మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ‘‘వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని నిరూపించుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఆస్తుల లావాదేవీల సమయంలో ఇది అవసరపడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే భర్త పేరుతో అప్డేట్ చేసిన ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ జాయింట్ అకౌంట్ పాస్‌బుక్ లేదా స్టేట్మెంట్, ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టు రుజువులు, అఫిడవిట్ సాయపడతాయి’’అని మిశ్రా తెలిపారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్ వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు.. ఆ దంపతులకు జని్మంచే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో తల్లి, తండ్రి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా.? అన్న సందేహం రావచ్చు. పిల్లల పేరిట పీపీఎఫ్, సుకన్య సముృద్ధి యోజన తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చే యాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికెట్ అవసరం పడు తుంది. అంతేకానీ, అందులో తల్లి, తండ్రి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే ఎలాంటి సమస్య రాదని మిశ్రా పేర్కొన్నారు. మొత్తం పేరే మారితే? కొన్ని వర్గాల ప్రజల్లో పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరే కాకుండా, మొదటి పేరులోనూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సమస్యలకు దారితీస్తుందని మిశ్రా చెప్పారు. అధికారిక రికార్డులతో పోలిస్తే పేర్ల మధ్య పోలిక లేకపోవడం వల్ల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేరు మార్చుకునే విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం వల్ల సవాళ్లను అధిగమించొచ్చని సూచించారు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
ఇల్లు అమ్మితే లాభం సంగతి..
మూలధన లాభం స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా..అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. మామూలు శ్లాబులు .. మామూలు రేట్లే స్వల్పకాలికానికి. ఈ వారం దీర్ఘకాలికం విషయం గురించి ఆలోచిద్దాం. ♦ దీర్ఘకాలిక మూలధన లాభం మీద పన్ను రేటు 20 శాతం. ♦ ఇది వ్యక్తులకు, హిందు ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే. ♦ ఈ ప్రత్యేక రేటు వర్తింప చేయడం వల్ల ♦ ఈ మూలధన లాభాన్ని ఇతర ఆదాయాలతో కలపరు. ♦ గతవారం మనం చూసిన ఉదాహరణలో ఆనందరావు గారి పెన్షన్ రూ. 10,00,000. ఇంటద్దె రూ. 3,00,000, వడ్డీ రూ. 2,00,000, మూలధన లాభం (దీర్ఘకాలికం) రూ. 20,00,000 అనుకోండి. 2024 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెన్షన్, ఇంటద్దె, వడ్డీలు మొత్తం రూ. 15,00,000లో సేవింగ్స్ రూ.2,00,000 తీసివేసి తదనుగుణమైన రేట్ల ప్రకారం పన్ను లెక్కిస్తారు. ♦ మూలధనలాభాలు దీర్ఘకాలికం కాబట్టి వాటిని ప్రత్యేకంగా భావించి కేవలం 20 శాతం చొప్పున లెక్కిస్తారు. దీనికి విద్యా సుంకం అదనం. ♦మూలధన లాభాలకు బేసిక్ లిమిట్‌ని వర్తింపచేస్తారు. ♦ఉదాహరణకు 60 ఏళ్ల సత్యనారాయణ గారికి ఇతర ఏ ఆదాయాలు లేవు అనుకుందాం. వారికి దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2,50,000 అనుకోండి. పన్ను కట్టక్కర్లేదు. ♦ఇలాంటి బేసిక్ లిమిటు 60 ఏళ్లు దాటి 80వ సంవత్సరంలో ఉన్న వారికి రూ. 3,00,000 చొప్పున, 80 ఏళ్లు దాటినవారికి రూ. 5,00,000 వర్తింపచేస్తారు. ♦అయితే, ఇతర ఆదాయం ఉండి ఉంటే ఆ ఆదాయంలో నుంచి సెక్షన్ 80సీ మొదలైన వాటిని తగ్గిస్తారు. ఉదాహరణకు, ఇతర ఆదాయం రూ. 1,50,000 ఉంటే, నిజంగా సేవ్ చేసి ఉంటే మినహాయింపు దొరుకుతుంది. ♦కేవలం దీర్ఘకాలిక మూలధన లాభం ఉంటే అందులో నుంచి సెక్షన్ 80సీ మొదలైన మినహాయింపులు, తగ్గింపులు రావు. ఇవ్వరు. ♦ 80సీ నుంచి 80 యు వరకు అమల్లో ఉన్న ప్రయోజనాలు ఇవ్వరు. ♦పైన చెప్పిన రూల్సు రెసిడెంటు వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి. ♦మూలధన లాభం మీద బేసిక్ రేటు 20 శాతం, విద్యా సుంకం, పరిమితి దాటితే సర్‌చార్జీ కూడా పడుతుంది. -
డైరెక్ట్ ప్లాన్లలో ఎస్‌డబ్ల్యూపీ, ఎస్టీపీ ఎలా..?
డైరెక్ట్ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్ చేస్తే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్ సంస్థ అందిస్తుందా? – విజయ్ కుమామ్ డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్ అండ్ మోర్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్ హౌస్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అయిన కేఫిన్‌టెక్, క్యామ్స్ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు. సమీపంలోని ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్‌కు స్వయంగా వెళ్లి సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా ఎస్టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లు సైతం డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్ హౌస్ సంస్థ నేరుగా సాయం అందించదు. నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ అనే ప్లాట్‌ఫామ్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. నేను ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్ డ్యూరేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు. -
వేలల్లో జీతాలు.. లక్షల్లో అప్పులు...
దిగువ మధ్యతరగతికి చెందిన రాజేష్ తండ్రి కష్టంలో బీటెక్ చేశాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో కష్టపడి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని మొత్తానికి ఒక ఐటీ కంపెనీలో చేరాడు. అంతవరకూ తండ్రి రామారావు పంపే ఐదారువేలను అతి పవిత్రంగా చూసుకుంటూ ఆచితూచి ఖర్చుపెడుతూ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు.. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగం ఆయన జీవితాన్ని మార్చేసింది.. ఇన్నాళ్ల నాటి ఆయన సంతోషాలను తీసుకుని ఒత్తిడిని నెత్తినపెట్టింది. ఊరికి వెళ్ళేటపుడు హాయిగా బస్సులో వెళ్లే రాజేష్ ఇప్పుడు సెకెండ్ క్లాస్ ఏసీ లేకుంటే ప్రయాణం కుదరడం లేదు. మామూలు టిఫిన్లు మానేశాడు.. రెండు ఇడ్లీలు కూడా రెస్టారెంట్లోనే తింటున్నాడు. మామూలు బట్టలు నాసిరకంగా కనిపిస్తున్నాయి. అన్నీ బ్రాండెడ్.. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ చూసి ఫ్రెండ్ నవ్వాడని దాన్ని పారేసి లక్షన్నర పెట్టి ఐ- ఫోన్ కొన్నాడు. టీషర్ట్స్, చెప్పులు, వాచీ.. ఆఖరుకు తాను ప్రతినెలా క్రాఫ్ చేయించుకునే సెలూన్‌ను కూడా మార్చేశాడు.. దాన్నిపుడు స్పా అంటున్నారు.. జంట్స్ హైటెక్ సెలూన్ అన్నమాట. మామూలు హీరో హొండాను అమ్మేసి పెద్ద బైక్ మూడు లక్షలు పెట్టి కొన్నాడు. ఫ్రెండ్స్‌తో రూమ్ షేరింగ్ తప్పు అనిపించింది.. ఇంకాస్త పెద్ద ఫ్లాట్‌కు మారాడు.. రెంట్ పదిహేనువేలు.. ఒక్కడికే ఇంత ఇల్లు ఎందుకురా అని నాన్న అంటే ఈమాత్రం లేకపోతే మనకు గౌరవం ఉండదు నాన్నా అని నమ్మించాడు.. ఓహో.. నిజమే కావచ్చు అనుకున్నాడు అమాయకపు పల్లెటూరి రామారావు. కాలం మారింది. కరోనా దెబ్బకు ఉద్యోగం పోయింది.. పరిస్థితి తిరగబడింది.. ఉద్యోగం పోయినా అప్పులు ఊరుకోవు. ప్రతిరోజు బ్యాంక్ వాళ్ల ఫోన్లు.. క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టకపోతే పెనాల్టీ.. ఇవన్నీ వెరసి రాజేష్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.. రెండు మూడేళ్ళలో రాజేష్ మొత్తం హై క్లాస్ అయిపోయాడు. జీతం డెబ్బై వేలు అయినా అందులో అరవైవేల వరకు ఖర్చులు, ఇన్స్టాల్మెంట్స్కు పోతున్నాయి. నేలయ్యేసరికి మిగిలేది ఏమీ ఉండడం లేదు. తండ్రికి అయినా అయిదారువేలు పంపే పరిస్థితి లేకపోతోంది. డబ్బు భలే జబ్బు మొదట్నుంచి లావిష్, విలాసంగా బతికే కుటుంబాలు వేరు.. కానీ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, ఒకేసారి ఆర్థిక స్థోమత పెరిగినవాళ్లు ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందరితోబాటూ మనమూ భారీగా రిచ్చుగా లేకపోతే పదిమందిలో తమకు విలువ తగ్గుతుందనే ఆత్మన్యూనతా భావన వారిని మరింత చిక్కుల్లోకి నెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా భారీ ఖర్చులు.. వీళ్ళ జీతం చూసి బ్యాంకులు సులువుగా లోన్లు ఇస్తూ కుర్రాళ్లను తమగుప్పిట్లో పెట్టుకున్నాయి. పైసా చేతిలో లేకున్నా క్రెడిట్ కార్డుతో కొనేసే అవకాశం కూడా ఉండడంతో.. హోటల్ బిల్లులు.. బట్టలు.. ఫోన్లు ఇవన్నీ ఎడాపెడా కొనేస్తున్నారు. తాహతుకు మించి అద్దెలు కట్టి ఇద్దరు దంపతులు ఉన్న చోటకూడా ట్రిపుల్ బెడ్ రూమ్స్ అద్దెకు తీసుకుంటున్నారు. ప్రతివారం సినిమాలు.. మల్టీప్లెక్సులు.. పబ్బులు.. రెండువారాలకోసారి పార్టీలు.. ఇవన్నీ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి అనుకుంటున్నారు తప్ప తమ జీవితాలను కిందికి తొక్కేస్తున్నాయని గ్రహించేలోపు పరిస్థితులు చేయిజారిపోతున్నాయి. తన టీములో పనిచేసే కొలీగ్‌కు కార్ ఉంది కాబట్టి మనం కొనేయాలి. ఆయన లక్షన్నర పెట్టి టీవీ కొన్నాడు కాబట్టి మనం కొనకపోతే పెద్ద నేరం. ఏటా మూడుసార్లు కనీసం యాభైవేలు ఖర్చు చేసి టూర్లు వెయ్యాలి.. బ్రాండెడ్ వస్తువులు లేకపోతే నామోషీ.. పదిమందిలో నిలవలేం.. వారిముందు ఐదు వందల విలువైన చెప్పులు వేస్తే నవ్వుతారు కాబట్టి చెప్పులు కనీసం పదివేలకు తగ్గకూడదు. తరచూ పార్టీలు ఇవ్వకుంటే మనకు గౌరవం ఉండదు కాబట్టి అప్పు చేసి అయినా పార్టీలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రస్తుతం యువతను మింగేస్తున్న అవలక్షణాలు . ఎవరో ఏమో అనుకుంటారు అనే భావనలో తమనుతాము మోసం చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవేళ కాలం తిరగబడి ఉద్యోగం తేడా జరిగి.. ఆర్నెల్లు ఖాళీగా ఉండాల్సి వస్తే ? అప్పుడు ఏమి చేస్తారు. సేవింగ్స్ కూడా పెద్దగా ఉండవు.. ఈ టీవీలు.. అద్దె ఫ్లాట్స్.. కార్లు.. యాపిల్ వాచీలు.. ఇవేమి వాళ్ళను కాపాడే పరిస్థితి ఉండదు.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. జీతం ఉండగానే పొదుపు చేసుకోవాలి. ముందు తరాల కోసం కాకున్నా మీకోసం మీరు పొదుపు చేసుకోవాలి. మన తాత తండ్రులు నాలుగురేసి పిల్లల్ని అలవోకగా పెంచేవాళ్ళు.. ప్రయోజకులను చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క పిల్లాడితో ఉన్న జీవితాన్ని ఈదలేకపోతున్నారు.. కారణం ఏమిటి? అప్పట్లో బాధ్యత.. ఆదాయాన్ని బట్టి ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు అవసరం లేని ఖర్చులు.. విలాసాలు.. ఫాల్స్ ప్రిస్టేజిలు.. యువతను అప్పుల్లోకి దించేస్తున్నాయి. అలాగని అందరూ అలాగే ఉన్నారని కాదు.. ఇల్లు.. స్థలాలు.. పొలాలు.. బంగారం కొంటూ బాధ్యతగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు.. ఇలా ఉద్యోగాలు చేస్తూ అప్పులపాలై ఒత్తిడిమధ్య నలిగిపోతున్నవాళ్లూ ఉన్నారు. -సిమ్మాదిరప్పన్న.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement