-
ఐరాసలో జగన్ విజన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్ ది ఎస్డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. -
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు. -
ఢిల్లీలో తొలి ట్రాన్స్‌జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డీప్‌ఫేక్ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్ వీడియోను మొదట పోస్ట్ చేసినది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ‘ఎక్స్’ నుంచి మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు.ల్యాండ్ లైన్ ఐపీ అడ్రస్ నుంచి..గత నెల 23న మెదక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ మాట్లాడినట్టు ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఎక్స్, ఫేస్బుక్ ఖాతాల్లో అది వైరల్‌గా అయి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీశ్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ చేశారు.మరోవైపు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్ చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ఫేస్‌బుక్‌లను స్పెషల్ సెల్ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ‘ఎక్స్’ సంస్థ.. తొలుత ఆ వీడియో పోస్ట్ అయినది తెలంగాణ నుంచేనని వెల్లడించింది. ఒక ల్యాండ్‌లైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్టుగా పేర్కొంది. అయితే ఎవరు చేశారనేది ఇంకా వెల్లడించలేదు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మళ్లీ ‘ఎక్స్’కు లేఖ రాశారు. కచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది? ఎక్స్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు? ఎవరెవరు షేర్ చేశారు? కామెంట్లు/లైకులు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. ‘ఎక్స్’ సంస్థ ఒకట్రెండు రోజుల్లో సమగ్ర నివేదిక అందించే అవకాశం ఉంది. -
అందుకే ‘ఓటుకు నోటు’ విచారణ బదిలీ కోరుతున్నాం
న్యూఢిల్లీ, సాక్షి: రాజకీయాలతో ముడిపడిన కేసు, పైగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు గనుకే.. ఓటుకు నోటు కేసు విచారణ ప్రభావితం కాకుండా మరో చోటుకి బదిలీ కోరుతున్నామని సుప్రీం కోర్టులో పిటిషనర్ వాదించారు. శుక్రవారం ఉదయం ఓటుకు నోటు కేసు పిటిషన్‌కు సంబంధించిన విచారణ జరిగింది.ఈ పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు పంపించింది. అయితే రెండు వైపుల నుంచి కౌంటర్ మాత్రం దాఖలు కాలేదు. దీంతో కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే.. కౌంటర్ తప్పకుండా వేయాలంటూ తాము ఆదేశించలేమని జస్టిస్ గవాయితో కూడిన త్రిసభ్య ధర్మాసనం, పిటిషనర్‌కు స్పష్టం చేస్తూ విచారణను జులైకి వాయిదా వేసింది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో విచారణ భోపాల్ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపుతోంది.ఇక.. విచారణ సమయంలో ఇరువర్గాల న్యాయవాదులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక దశలో పరిస్థితి శ్రుతి మించడంతో ‘‘ఇంతటి క్రమశిక్షణరాహిత్యాన్ని ఎప్పుడూ చూడలేదు’’ అంటూ జస్టిస్ బిఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ఈ కేసు విచారణను భోపాల్‌కే ఎందుకు బదిలీ చేయాలని కోరుతున్నారని బెంచ్ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న కేసు కాబట్టే.. బదిలీ కోరుతున్నామని జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది బెంచ్‌కు తెలియజేశారు.2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ రేవంత్ తెలంగాణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ నడుస్తున్న పిటిషన్లో రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాలు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు పేరెక్కడ?చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని ఆర్కే తన పిటిషన్ ద్వారా లేవనెత్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement