కోహ్లి సూపర్‌ ఫీల్డింగ్‌ చూశారా? | Sakshi
Sakshi News home page

కోహ్లి సూపర్‌ ఫీల్డింగ్‌ చూశారా?

Published Tue, Oct 30 2018 9:04 AM

మ్యాచ్‌ ఏదైనా తనదైన ముద్ర ఉండేలా చూసే టీమిండియా కెప్టన్‌​ విరాట్‌ కోహ్లి... ముంబైలో తక్కువ స్కోరుకే ఔటైనా మెరుపు ఫీల్డింగ్‌తో తళుక్కుమన్నాడు. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ శామ్యూల్స్‌ కవర్స్‌ దిశగా కొట్టిన షాట్‌ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్‌తో బంతిని నాన్‌ స్ట్రయికింగ్‌ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది. అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్‌ పావెల్‌ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ రనౌట్‌కు పావెల్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు.

Advertisement
Advertisement