323వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

323వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Mon, Dec 17 2018 7:31 AM

అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 323వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు సోమవారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని జమ్ము జంక్షన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి టెక్కలిపాడు క్రాస్‌, రావడపేట, చిన్నదుగాం జంక్షన్‌, నారాయణ వలస, రాణ జంక్షన్‌ మీదుగా లింగాల వలస వరకు ప్రజాసంకల్పయాత్ర  కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement