అమెరికాలో భారత విద్యార్థి కాల్చివేత | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత విద్యార్థి కాల్చివేత

Published Fri, Nov 17 2017 10:40 AM

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ కిరాణా దుకాణంలో దొంగతనానికి వచ్చిన నలుగురు వ్యక్తులు భారత విద్యార్థిని కాల్చి చంపారు. హంతకుల్లో ఒకరు భారత సంతతికి చెందినవాడని తెలిసింది. ఫ్రెస్నో పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల ధరమ్‌ప్రీత్‌ సింగ్‌ జసార్‌ అనే విద్యార్థి టాకిల్‌ బాక్స్‌ అనే స్టోర్‌లో పనిచేస్తున్నాడు.