అరుదైన ‘ఫ్లైయింగ్‌ స్నేక్‌’ స్వాధీనం | Sakshi
Sakshi News home page

అరుదైన ‘ఫ్లైయింగ్‌ స్నేక్‌’ స్వాధీనం

Published Tue, Aug 20 2019 5:56 PM

అరుదైన రకానికి చెందిన పామును ఓ యువకుడి వద్ద నుంచి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భువనేశ్వర్‌కు చెందిన ఓ యువకుడు అరుదుగా కనిపించే ఫ్లైయింగ్‌ స్నేక్‌ను పట్టుకున్నాడు. దానిని ప్రజల ముందు ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మంగళవారం అతడి నుంచి పామును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సదరు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement