కాస్త వదులు ‘బాబూ’.. దిగిపోతా..! | Sakshi
Sakshi News home page

కాస్త వదులు ‘బాబూ’.. దిగిపోతా..!

Published Thu, Mar 28 2019 1:59 PM

ఎన్నికలొచ్చాయ్‌.. ఓటర్లు దేవుళ్లై పోయారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎన్నికల వేళ రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఆ వరుసలో ఏపీ సీఎం చంద్రబాబు ముందుంటారు. అయిదేళ్ల పాలనలో కనిపించని ప్రజలు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయనకు ఒక్కసారిగా గుర్తుకు వచ్చారు. ఓవైపు హామీల నాటకాలకు తెరతీస్తూనే మరోవైపు ప్రచార వేదికలపై తెచ్చిపెట్టుకున్న ‘అనురాగం’ చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఎవరినీ చేతితో తాకని చంద్రన్న ఈ సారి ఓ ముసాలావిడ పట్ల తెగ ప్రేమ కురిపించేశారు.

ఓ అవ్వను సైకిల్‌పై ఎక్కించుకున్న చంద్రన్న అక్కడున్నవారికి అభివాదం చేశారు. ఆమెతో చనువుగా ఉన్నారు. దీంతో బాబును దీవించేందుకు ఆ వృద్ధురాలు ఆయన తలపై చేతులు పెట్టగా బాబు సహకరించలేదు. ఆమె చేతులను బలవంతంగా తన మొహంపై నుంచి తీసివేశారు. ఇక చాలులే అన్నట్టు ఆమెను సైకిల్‌ దించేశారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం బాబు ఎన్నికల స్టంట్‌గాలాగా తోస్తోందని సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

Advertisement
Advertisement