ఆర్జీవీపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

ఆర్జీవీపై కేసు నమోదు

Published Thu, Jan 25 2018 5:16 PM

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆర్జీవీపై సీసీఎస్‌ పోలీసులకు సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం విడుదల కాకుండా చూడాలని కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

Advertisement
Advertisement