రామ్‌ చరణ్‌కు అమితాబ్‌ విషెస్‌ | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌కు అమితాబ్‌ విషెస్‌

Published Wed, Mar 27 2019 11:56 AM

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్‌ కు విషెస్‌ తెలుపుతూ అమితాబ్ రిలీజ్ చేసిన వీడియో సందేశాన్ని ఉపాసన తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా చరణ్‌ తనకు 18 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని ఎప్పటికీ అలాగే ఉండాలని ఆకాంక్షించారు అమితాబ్‌. చివరగా తెలుగులో చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తన సందేశాన్ని ముగించారు.

Advertisement
Advertisement