అందరూ చూస్తుండగా అమ్మాయిపై ఘోరం | Sakshi
Sakshi News home page

అందరూ చూస్తుండగా అమ్మాయిపై ఘోరం

Published Thu, Feb 2 2017 12:36 PM

కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులో అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.