నిట్‌లో కృష్ణా రివర్‌ బేసిన్‌ స్టడీ సెంటర్‌ | Sakshi
Sakshi News home page

నిట్‌లో కృష్ణా రివర్‌ బేసిన్‌ స్టడీ సెంటర్‌

Published Sat, May 25 2024 1:25 PM

నిట్‌లో కృష్ణా రివర్‌ బేసిన్‌ స్టడీ సెంటర్‌

కాజీపేట అర్బన్‌ : వరంగల్‌ నిట్‌లో కృష్ణా రివర్‌ బేసిన్‌ స్టడీ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్‌లోని సీ గంగా అండ్‌ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ వినోద్‌ థారే, నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుధీ సంయుక్తంగా ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జలవనరుల, నది అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ సౌజన్యంతో సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. కృష్ణానది సమగ్ర పరిస్థితిని అంచనా వేయడంతోపాటు పునరుద్ధరణ, నిర్వహణకు ప్రణాళికలను సిద్ధం తదితర అంశాల అధ్యయనానికి సెంటర్‌ తోడ్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటీ కాన్పూర్‌, నిట్‌ వరంగల్‌, సూరత్‌కల్‌ కన్సార్జీయంలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నేషనల్‌ రివర్‌ కన్జర్వేషన్‌ డైరెక్టరేట్‌ జాయింట్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ అగర్వాల్‌, ఎన్సీడీ డైరెక్టర్‌ అశోక్‌బాబు, సైంటిస్ట్‌ శ్రీవాత్సవ, బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement