Sakshi News home page

కొమ్మాల జాతర షురూ

Published Tue, Mar 26 2024 1:35 AM

-

తరలివచ్చిన రాజకీయ ప్రభబండ్లు

గీసుగొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా అంటూ భక్తుల నినాదాలు.. రాజకీయ ప్రభల హోరు మధ్య కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సోమవారం వైభవంగా ప్రారంభమైంది. హోలీ పండుగ ముగించుకొని భక్తులు రాత్రి జాతరకు భారీగా తరలివచ్చారు. రాత్రి 10 గంటలకు కొమ్మాల స్టేజీ వద్ద అల్లం బాలకిశోర్‌రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భారీ ప్రభను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడుగుర్రాల (బొమ్మగుర్రాల) వాహనంపై ఎమ్మెల్యే జాతరలోకి ప్రవేశించారు. పలుపార్టీల నాయకులు బోడకుంట్ల ప్రకాశ్‌, డాక్టర్‌ పెసరు విజయచందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండితో ఆయా పార్టీల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఎన్నికల కోడ్‌ ఉన్నా.. అ వేమి పట్టించుకోకుండా ప్రభలు, డీజేలతో జాతరకు తరలివచ్చా రు.రాజకీయ ప్రభలతో కొమ్మాల స్టేజీ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది.

భక్తిభావంతో మెలగాలి:రేవూరి

భక్తులు రాజకీయ గొడవలకు పాల్పడకుండా భక్తి భావంతో స్వామి వారిని దర్శనం చేసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి కోరారు. జాతర ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ఎంపీపీ భీమగాని సౌజన్య, జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు తాడ కొంరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కూసం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement