Sakshi News home page

అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించాలి

Published Thu, Nov 9 2023 1:52 AM

మాట్లాడుతున్న వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య  - Sakshi

వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య

కరీమాబాద్‌ : నిబంధనల మేరకు అభ్యర్థుల వ్యయ వివరాలను పక్కాగా నమోదు చేయాలని వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నోడల్‌ అధికారులు, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించిన సహాయ వ్యయ పరిశీలకులతో ఎన్నికల వ్యయాల నమోదు వివరాలు, ఓటర్ల నమోదు శాతం పెంచేందుకు స్వీప్‌ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభ్యర్థుల వ్యయాన్ని నిశితంగా పరిశీలించి, ఎన్నికల సంఘానికి రోజువారీ నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి ఫిర్యాదులు, సమాచారం తీసుకుంటూ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైన ప్రాంతాలపై ప్రతేక శ్రద్ధ వహించి నమోదు శాతం పెంచాలని చెప్పారు. సమావేశంలో నోడల్‌ అధికారి సంజీవరెడ్డి, పుష్పలత, భాగ్యలక్ష్మి, రామిరెడ్డి, నర్సింహమూర్తి, అయూబ్‌ అలీ, శ్రీధర్‌, శ్రీనివాసరావు, మానస, నారాయణరావు, శ్రీకాంత్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement