Sakshi News home page

ఎన్నికల కమిషన్‌కు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి

Published Mon, Apr 15 2024 12:30 AM

పీడిక రాజన్నదొర - Sakshi

సీఎంపై జరిగిన హత్యాయత్నంపై

సమగ్రదర్యాప్తు చేయాలి

సాలూరు: ప్రజాభిమానం మెండుగా ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్య మంత్రి కావ డం ఖాయమని అన్ని సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఉక్రోశంతో జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ, జనసేన కుట్ర చేశాయని, ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానంగా ఉందని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం రాత్రి విజయవాడలో జగ న్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం హేయమమటూ తీవ్రంగా ఖండించారు. ప్రజల మనస్సు గెలుచుకోవడం ప్రజాస్వామ్యం గానీ, ప్రజాభిమా నం ఉన్న నాయకుడి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యం కాదని, క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు జగ న్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ, జగన్‌కు, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచారని వారందరికీ ధన్యవా దాలు చెబుతున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు, ఆ విజయవాడ కనకదుర్గమ్మ చల్లని చూపు వల్లనే జగన్‌మోహన్‌రెడ్డి పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారన్నారు. అయితే ఈ దాడిని టీడీపీ శ్రేణులు, పచ్చ మీడియా వక్రీకరిస్తూ సింపతీ కో సం ఇలా చేశారంటూ సోషల్‌ మీడియాల్లో పోస్టింగ్‌లు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ సంఘట న పై టీడీపీ పెడుతున్న సోషల్‌ మీడియా పోస్టింగ్‌లపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో పలువురు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement