ఆక్రమణలు తొలగించాలి | Sakshi
Sakshi News home page

ఆక్రమణలు తొలగించాలి

Published Sat, May 25 2024 12:10 PM

ఆక్రమణలు తొలగించాలి

వేలూరు: కార్పొరేషన్‌ పరిధిలోని వాగులు, కాలువ లు, డ్రైనేజీ కాలువలపై ఉన్న ఆక్రమణలను వెంట నే తొలగించి డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేషన్‌ ప రిధిలోని ఆరో వార్డులో రాజావల్లి నగర్‌, వీఐటీ మె యిన్‌గేట్‌, చైన్నె రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆమె అ కస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ కాలువల్లో పూడిక తీత పనుల ను చేపట్టాలన్నారు. రానున్న వర్షా కాలంలో వర్షపు నీరు రోడ్డుపైకి రాకుండా చూడాలన్నారు. అలాగే కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులు సేకరించే చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కేటాయించిన ప్రాంతంలోనే చెత్తను వేసి, దాన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసి విక్రయించాలన్నారు. మొ త్తం 60 వార్డుల్లో సేకరించే ప్లాస్టిక్‌ వస్తువులు పూర్తి గా ఒక చోట చేర్చి, వాటిని అరియలూరు సిమెంట్‌ కంపెనీకి విక్రయించేలా చూడాలన్నారు. అనంత రం చెత్తను సేంద్రియ ఎరువులుగా తయారు చేసే కేంద్రాన్ని తనిఖీ చేసి, ఎరువులను ఎంత ధరకు వి క్రయిస్తున్నారన్న విషయం అడిగి తెలుసుకున్నారు. అలాగే విరుదంబట్టులోని రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేసి, రేషన్‌ కార్డు దారులకు సక్రమంగా నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారా? లేదా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆమెతో పాటు కార్పొరేషన్‌ కమిషనర్‌ జానకి, జోన్‌ అధికారి సెంథిల్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌, కార్పొరేటర్‌ శ్రీనివాసన్‌, కార్పొరేషన్‌ అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement