ఆధునిక విధానంతో శస్త్ర చికిత్స | Sakshi
Sakshi News home page

ఆధునిక విధానంతో శస్త్ర చికిత్స

Published Sat, Jan 20 2024 1:22 AM

-

సాక్షి, చైన్నె: డాక్టర్‌ అగర్వాల్స్‌లో మినిమల్లీ– ఇన్వాసివ్‌ గ్లకోమా సర్జరీని(ఎంఐజీఎస్‌) ఆధునిక విధానంతో విజయవంతం చేశారు. ఈ వివరాలను శుక్రవారం డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశ్విన్‌ అగర్వాల్‌ మీడియాకు వివరించారు. చైన్నెకు చెందిన 63 ఏళ్ల గ్లాకోమా రోగికి యాంటి గ్లాకోమా కంటి చుక్కలను గత 10 ఏళ్లుగా వాడుతూ వచ్చారు. ఆయనకు ఆధునిక విధానంలో ఎంఐజీఎస్‌ శస్త్ర చికిత్సతో ప్రతిరోజూ కంటి చుక్కలను ఉపయ్గోగించాల్సిన అవసరం లేని విధంగా శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. శస్త్ర చికిత్స మేరకు ఆయన కళ్లలో రెండు స్టెంట్‌లను ఉంచామని, ఇది ద్రవం ప్రవాహాన్ని మెరుగుపరిచినట్టు అశ్విన్‌ అగర్వాల్‌ వివరించారు. ఆస్పత్రి రీజినల్‌ హెడ్‌ డాక్టర్‌ ఎస్‌ సౌందరి పాల్గొన్నారు.

మాజీ మంత్రి కోడలు

చీరకు నిప్పు

తిరువొత్తియూరు: ధర్మపురి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్భళగన్‌ కుమారుడు శశిమోహన్‌ కారిమంగంలోని కెరోడల్లి ప్రాంతంలో నివశిస్తున్నాడు. ఇతని భార్య పూర్ణిమ. గురువారం పూజా గదిని శుభ్రం చేస్తున్నారు. లో బీపీ ఏర్పడడంతో పూర్ణిమ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులకు పూజా గదిలోని దీపం నుంచి మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల వారు హుటాహుటిన వచ్చి పూర్ణిమ దుస్తులకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఇందులో పూర్ణిమకు గాయాలు కావడంతో ఆమెను రక్షించి కారిమంగళం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పూర్ణిమ చికిత్స పొందుతున్నాడు.

Advertisement
Advertisement