Sakshi News home page

భక్తులకు స్నాన ఘట్టాలు సిద్ధం

Published Wed, Nov 22 2023 1:32 AM

మట్టపల్లి దేవాలయం వద్ద కృష్ణానదిలో సిద్ధం చేసిన మార్కండేయ పుష్కర ఘాట్‌ - Sakshi

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కృష్ణానదిలో భక్తుల కోసం స్నానఘట్టాలు సిద్ధం చేసినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం వారు స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. కృష్ణానదిలో ఏటా కార్తీక మాసంలో పుణ్యస్నానాలకు పులిచింతల బ్యాక్‌ వాటర్‌ వల్ల ఇబ్బందులు ఉండేవన్నారు. అయితే ఈఏడాది పులిచింతల ప్రాజెక్టులో పూర్తి నిల్వ 43టీఎంసీలకు గాను కేవలం 13టీఎంసీలకు తగ్గడంతో మట్టపల్లి ఆలయం వద్ద స్నానఘట్టాలు తేలి ఉన్నాయని చెప్పారు. దీంతో నిత్యం వచ్చే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఇక నుంచి నేరుగా కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసేందుకు వీలుకలిగిందన్నారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారా యణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, లక్ష్మీనరసింహమూర్తి , భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement