దినపత్రికలే వారికి ఆస్తి..

- - Sakshi

ఆదివారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2024

సహర్‌ :

సోమవారం

(ఉదయం)

5:01

ఇఫ్తార్‌ :

ఆదివారం

(సాయంత్రం) 6:32

కొత్త విషయాలుతెలుసుకుంటున్నాం

రామారావు సార్‌ వద్ద ట్యూషన్‌కు వస్తున్నా. ఇంగ్లిష్‌ గ్రామర్‌, వివిధ సబ్జెక్ట్‌లపై పాఠాలు చెబుతున్నారు. అలాగే పేపర్‌లో వచ్చే విషయాలు కూడా చెబుతున్నారు. రోజూ న్యూస్‌ పేపర్‌ చదివిస్తారు. ఆరోగ్యరీత్యా సెల్‌ఫోన్‌లో కన్నా ప్రింట్‌ పేపర్‌ చదివితేనే మంచిదని, జ్ఞాపకం ఉంటుందని సార్‌ చెబుతుంటారు.

– డి.దీపిక,

5వ తరగతి, హుస్నాబాద్‌

హోం వర్క్‌లో భాగం

న్యూస్‌ పేపర్‌ చదవడం మా హోంవర్క్‌లో ఓ భాగం. చాలా విషయాలు పేపర్‌ ద్వారా తెలుసుకుంటున్నాం. సెల్‌ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించవద్దని చెబుతారు. పేపర్‌లో ఉన్న ఘటనలు వివరిస్తూ మాకు అర్థమయ్యే రీతిలో చెబుతారు. దీంతో పేపర్‌ చదవాలనే ఆసక్తి పెరుగుతోంది.

– బి. రుషిక్‌,7వ తరగతి, హుస్నాబాద్‌

50 ఏళ్ల నాటి పత్రికలు,

పుస్తకాలు భద్రంగా..

రోజూ 5 తెలుగు దినపత్రికలు, 2 ఇంగ్లిష్‌ పత్రికలు కొనుగోలు

పేపర్‌ ధర నాలుగు పైసలు ఉన్నప్పటి నుంచి..

సాక్షి దినపత్రిక ప్రారంభ పేపర్‌ నుంచి నేటి వరకు సేకరణ

పత్రికా ప్రియుడు రామారావు విభిన్న శైలి

మనం ఎవరి ఇంటికై నా వెళ్తే మొదటగా కనిపించేవి ఖరీదైన ఫర్నిచర్‌, అందమైన అలంకరణ వస్తువులు. కానీ నాదమునుల రామారావు ఇంటికి వెళ్తే ముందుగా దినపత్రికలు, పుస్తకాలే దర్శనమిస్తాయి. అందమైన అలంకరణ వస్తువులు, ఫర్నిచర్‌ ఉన్నా, పుస్తకాలు లేకుంటే కళాహీనంగా ఉంటుందని ఆయన భావిస్తారు. రామారావు ఇంటిలో ఏ మూలకు చూసిన దినపత్రికలు, ఏ సజ్జ మీద చూసిన, వంట గదిలో చూసినా వివిధ రకాల పుస్తకాలు, పత్రికలు భద్రపరిచి ఉంటాయి. ఆయన ఇంట్లో ఏ పేపర్‌, ఏ పుస్తకాన్ని చూసిన ఇప్పుడే ముద్రించినట్లుగా కనిపిస్తాయి. ఒకప్పుడు పాఠకలోకాన్ని, పుస్తక ప్రియులను ఆనంద అనుభూతులతో ఓలలాడించిన దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, విజయచిత్ర, భారతీ, సినిమా రంగం, సోవియట్‌ యూనియన్‌, సోవియట్‌ లాండ్‌, సోవియట్‌ ఉమెన్‌, ఇంకా తాళపత్ర గ్రంథాలు, ఏళ్ల సంవత్సరాల నాటి పుస్తకాలు ఆయన ఇంటిలో కొలువయ్యాయి. సాక్షి దినపత్రిక ప్రారంభ పేపర్‌ నుంచి ఇవాళ్టి ఎడిషన్‌ వరకు అన్ని ప్రతులను భద్రపరిచారు.

రామారావు, అభినందన దంపతులకు సంతానం లేదు. సొంత ఇల్లు లేదు. ఇతరత్రా ఆస్తిపాస్తులు లేవు. వీరిద్దరూ ఉన్నత విద్యలు చదివారు. రామారావు ఎం.ఏ ఇంగ్లిష్‌, భార్య అభినవ ఎం.కాం పూర్తి చేశారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చినా.. ఆ రెండు ఉద్యోగాలు తమకంటే ఎక్కువ అవసరాలు ఉన్న వారికి ఉపయోగపడాలనే ఉన్నతమైన ఆశయంతో ఒదులుకున్నారు. కాలుష్య నివారణలో భాగంగా సొంత వాహనం కూడా కొనలేదు. 25 మంది పిల్లలకు ఇంగ్లిష్‌ గ్రామర్‌ చెబుతూ వచ్చే ఆదాయంతోనే వారు జీవనం సాగిస్తున్నారు. రామారావు తెల్లవారు జామునే బస్టాండ్‌ స్టాల్‌కు నడిచి వెళ్లి పేపర్లు కొని తెచ్చుకొని చదువుతాడు. ప్రతి రోజూ 5 తెలుగు దినపత్రికలు, 2 ఇంగ్లిష్‌ పత్రికలు కొనుగోలు చేస్తాడు. పత్రికల్లో వచ్చే సమాచారాన్ని రామారావు దంపతులు విద్యార్థులకు పాఠాలుగా అందిస్తున్నారు. ప్రతి రోజూ ఇంగ్లిష్‌ గ్రామర్‌ నేర్పుతూనే పత్రికల్లో వస్తున్న సంఘటనలు, కథనాలను చదివిస్తూ పేపర్లపై అవగాహన కల్పిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

Election 2024

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top