Sakshi News home page

శ్రీరామ పాదుకలు అందజేత

Published Wed, Nov 15 2023 12:54 AM

-

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై చిన్నజీయర్‌స్వామి 67వ తిరు నక్షత్ర మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీరామ పాదుకలను బహూకరించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ చిన్నజీయర్‌ స్వామి 67వ తిరు నక్షత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, శ్రీరామ పాదుక పూజ గావించామని, త్రిదండి చిన్న రామానుజ జీయర్‌స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం, తీర్థ ప్రసాదాలు గావించారని తెలిపారు. తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా పలు పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులకు శ్రీరామ పాదుకలను బహూకరించారు. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు.

Advertisement

What’s your opinion

Advertisement