స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కాపలా | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కాపలా

Published Sat, May 25 2024 3:15 PM

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కాపలా

పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. దీంతో కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో రాత్రివేళలో కాపలా ఉంటున్నారు. మోహనా నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దాశరథి గొమాంగో, బీజేపీ అభ్యర్థి (మోహనా) ప్రశాంత్‌ మల్లిక్‌తో పాటు పర్లాఖెముండి నియోజికవర్గ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు స్ట్రాంగ్‌ రూమ్‌ బయట కాపలా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు వచ్చే 4న జరగనున్న దృష్ట్యా అధికార పార్టీపై అనుమానంతో కాపలాగా ఉంటున్నామని అభ్యర్థులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement