ఎకై ్సజ్‌ అధికారుల ముమ్మర దాడులు | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ అధికారుల ముమ్మర దాడులు

Published Sat, May 25 2024 3:10 PM

ఎకై ్సజ్‌ అధికారుల ముమ్మర దాడులు

జయపురం: నాటుసారా తయారీ కేంద్రాలపై అబ్కారీశాఖాధికారులు శుక్రవారం ముమ్మరంగా దాడులు చేశారు. నవరంగపూర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కమళ లోచన మిశ్ర, జిల్లా అబ్కారీశాఖాధికారి అభిరాం బెహరల ఆదేశాల మేరకు.. నవరంగపూర్‌ అబ్కారీశాఖ విభాగ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ రథ్‌ పర్యవేక్షణలో నవరంగపూర్‌ అబ్కారీ స్టేషన్‌ అధికారి సుజిత్‌ నాగ్‌ తన సిబ్బందితో సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. అబ్కారీ విభాగ బృందం సభ్యులు ఖతిగుడ పోలీసు స్టేషన్‌ పరిధి సవురాగుడ గ్రామం సమీప కొండ వాగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నాటు సారా వంటకానికి సిద్ధం చేసిన 2,400 లీటర్ల ఇప్ప ఊట, 750 లీటర్ల నాటు సారా పట్టుకొని వాటిని ధ్వంసం చేసినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే తెంతులికుంటి పోలీసుస్టేషన్‌ పరిధిలో కొహియిగుడ గ్రామానికి చెందిన మధు బిశాయి అనే వ్యక్తి వద్ద 21 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు. దాడుల్లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ త్రినాథ్‌ సౌర, మహిళ కానిస్టేబుల్‌ రంజీ జానీ, కానిస్టేబుల్‌ సుధాంశు శేఖర బాగ్‌, రంజిత్‌ సింహ, ఛతర గోండ్‌, అంశుమాన్‌ పొరిడ ఉన్నారు.

2,400 లీటర్ల ఇప్ప ఊట ధ్వంసం

750 లీటర్ల నాటుసారా ధ్వంసం

Advertisement
 
Advertisement
 
Advertisement