తొలిరోజు ప్రశాంతం | Sakshi
Sakshi News home page

తొలిరోజు ప్రశాంతం

Published Sat, May 25 2024 3:00 PM

-

టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

విజయనగరం అర్బన్‌: పదోతరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పదోతరగతి తెలుగు పరీక్షకు 1,218 మందికి 489 మంది మాత్రమే హాజరైనట్టు డీఈఓ ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ సంప్లిమెంటరీ పరీక్షల్లో తొలి రోజు ఉదయం మొదటి సంవత్సర తెలుగు–1, సంస్కృతం–1, హిందీ–1, ఒకేషనల్‌–1 పరీక్షకు 3,542 మందికి 3,320 మంది హాజరయ్యారని ఆర్‌ఐఓ ఎం.ఆదినారాయణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన రెండో సంవత్సరం తెలుగు–2, సంస్కృతం–2, హిందీ–2, ఒకేషనల్‌–2 సబ్జెక్టు పరీక్షలకు 969కి 883 మంది హాజరయ్యారు.

సజావుగా డీఈఈ సెట్‌

జిల్లాలో శుక్రవారం నిర్వహించిన డీఈఈ సెట్‌–2024 ప్రవేశ పరీక్ష స్థానిక సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో జరిగే పరీక్షకు 256 మంది హాజరుకావాల్సి ఉండగా 228 మాత్రమే పరీక్ష రాసినట్టు డీఈఓ ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement