పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది పయనం | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది పయనం

Published Fri, May 24 2024 9:45 AM

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది పయనం

భువనేశ్వర్‌: ఈ నెల 25న 3వ దశ పోలింగ్‌ భువనేశ్వర్‌ పార్లమెంటరీ నియోజక వర్గంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందిని ఖుర్దా జిల్లాలో పలు పోలింగు కేంద్రాలకు తరలించారు. పోలింగు సంబంధిత ఏర్పాట్లు పూర్తయినట్లు ఖుర్దా జిల్లా ఎన్నికల యంత్రాంగం తెలిపింది. స్థానిక బీజేబీ అటానమస్‌ కాలేజీ ఆవరణలోని స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి పోలింగ్‌ పార్టీ ఈవీఎంలతో పోలింగ్‌ బృందాలు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లాయి. తొలి విడత కింద పోలింగ్‌ బృందాలు గురువారం జయదేవ్‌, జట్నీ రెండు శాసన సభ నియోజకవర్గాల బూత్‌లకు తరలి వెళ్లాయి. జయదేవ్‌ నియోజక వర్గంలోని మొత్తం 236 పోలింగు కేంద్రాల్లో 164 కేంద్రాలకు సిబ్బంది పూర్తి సరంజామాతో చేరారు. మిగిలిన 72 కేంద్రాలకు పోలింగ్‌ బృందాలు శుక్రవారం చేరుతాయి. ఈ 72 కేంద్రాల్లో 49 సఖి బూత్‌లు, ఒక దివ్యాంగుల బూత్‌, 22 ఇతర బూత్‌లు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement