Sakshi News home page

No Headline

Published Wed, Apr 17 2024 1:10 AM

-

కామారెడ్డి క్రైం: అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ఆరుగురి మృతికి కారణమైన డ్రైవర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. 2016 అక్టోబర్‌ 1న పిట్లం మండలం కారేగాం గ్రామ సమీపంలోని పిల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో సంగారెడ్డి జిల్లా తడ్కల్‌కు చెందిన డ్రైవర్‌ ఫకీర్‌ ఇస్మాయీల్‌ కారును నడిపాడు. వరద ఉధృతిలో కారు కొట్టుకుపోగా, ఆరుగురు మృతి చెందారు. ఇస్మాయీల్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరుగురి మృతికి కారణమైన ఇస్మాయీల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అప్పటినుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. పూర్వాపరాలను పరిశీలించిన కామారెడ్డి మొదటి అడిషనల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి లాల్‌సింగ్‌ శ్రీనివాస్‌నాయక్‌ నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు రమణారెడ్డి, సత్యనారాయణ, ఎస్సై నీరేశ్‌ను ఎస్పీ సింధుశర్మ అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement