● వికసించిన ‘మే’ పుష్పం | Sakshi
Sakshi News home page

● వికసించిన ‘మే’ పుష్పం

Published Sat, May 25 2024 1:50 PM

● విక

‘మే’ పుష్పం వికసించింది. వాతావరణానికి అనుగుణంగా మే లేదా జూన్‌ నెలలో ఈ పుష్పం వికసిస్తుంది. ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మే నెలలోనే సున్నిపెంటలోని మాచిమండ నిహారిక ఇంటిలో మే పుష్పాలు కనువిందు చేస్తున్నాయి.

– శ్రీశైలంప్రాజెక్ట్‌

రోడ్డుప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి

గూడూరు: మండలంలోని పెంచికలపాడు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పత్తికొండ పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ హరిజన వెంకటస్వామి (44) ఆటోలో కర్నూలుకు వెళ్తుండగా తమిళనాడుకు చెందిన లారీ కర్నూలు నుంచి రాయచూర్‌ వైపు వెళ్తూ పెంచికలపాడు సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సుంకులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

పిడుగు పడి యువకుడికి తీవ్ర గాయాలు

ఎమ్మిగనూరు రూరల్‌: పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో శుక్రవారం రాత్రి పిడుగుపడటంతో సోమప్ప నగర్‌కు చెందిన యువకుడు హనమంతు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మార్కెట్‌లో హమాలీగా పని చేసే హనుమంతు రాత్రి వర్షం పడుతుండటంతో బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. వీవర్స్‌ కాలనీ మైదానం వద్దకు చేరుకోగానే పెద్ద శబ్దంతో పిడుగు హనమంతుపై పడటంతో కిందపడిపోయాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. కాగా హనమంతుకు రెండు నెలల క్రితమే వివాహమైనట్లు తండ్రి బడెసాబ్‌ తెలిపారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

బేతంచెర్ల: పట్టణంలోని బనగానపల్లె రైల్వే గేటు సమీపాన రైల్వే ట్రాక్‌పై శుక్రవారం తెల్లవారుజామున రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న నంద్యాల రైల్వే ఎస్‌ఐ అబ్దుల్‌ జలీల్‌, డోన్‌ రైల్వే ఏఎస్‌ఐ కుమార్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 40 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని, తల, మొండెం, కాళ్లు వేరుగా తెగిపడ్డాయని ఎస్‌ఐ తెలిపారు. బ్లాక్‌ పాయింట్‌ ధరించి ఉన్నాడని, రెండు చేతుల పైన పచ్చ బొట్టు తప్ప మృతదేహం వద్ద ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని ఆయన తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాలకు తరలించారు.

● వికసించిన ‘మే’ పుష్పం
1/2

● వికసించిన ‘మే’ పుష్పం

● వికసించిన ‘మే’ పుష్పం
2/2

● వికసించిన ‘మే’ పుష్పం

Advertisement
 
Advertisement
 
Advertisement