Sakshi News home page

మంత్రి శ్రీరామనవమి శుభాకాంక్షలు

Published Wed, Apr 17 2024 2:20 AM

చీమలగడ్డలోని ధాన్యం కొనుగోలు 
కేంద్రం వద్ద డీఎస్‌వో వెంకటేశ్వర్లు  - Sakshi

నల్లగొండ: రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రుడు ధర్మసంస్థాపన, విలువల ప్రతిష్టాపన, పితృవాక్యపరిపాలన వంటి సద్గుణాలను సమాజానికి అందించారని ఆయన గుర్తుచేశారు. ఆ యుగపురుషుడు నడిచిన బాటలో నడిచి సంక్షేమ రాజ్యస్థాపనలో, విలువలు కలిగిన సమాజ నిర్మాణంలో భాగం అవుదామని మంత్రి ప్రజలను కోరారు.

నకిలీ స్కీంలలో పెట్టుబడులు పెట్టి మోసపోకండి

ఎస్పీ చందనా దీప్తి సూచన

నల్లగొండక్రైం: మోసపూరిత నకిలీ స్కీంలలో పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోవద్దని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో సూచించారు. చైన్‌ లింకులతో పెట్టుబడులు పెట్టిన తరువాత మొదటగా కొంత ఇస్తూ ఆశ చూపించి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన తరువాత వాటిని ఎత్తేస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఇలా మోసపోయామని తమ వద్దకు కేసులు వస్తున్నాయన్నారు. సోషల్‌ మీడియా వాట్సాప్‌ల ద్వారా నిరుద్యోగులను ఆసరా చేసుకుని నకిలీ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూళ్లు చేస్తూ మోసం చేస్తున్నారని, అలాంటి వాటికి స్పందించి మోసపోవద్దని సూచించారు. ఏదేని మోసం జరిగితే, సమస్యలు వస్తే 100కు ఫోన్‌ చేయాలని తెలిపారు.

లక్ష్యాన్ని అధిగమించాలి

నకిరేకల్‌: ధాన్యం కొనుగోలులో నిర్దేంచిన లక్ష్యాన్ని అధిగమించామని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, తూకాల్లో పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. నకిరేకల్‌లోని చీమలగడ్డలో పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాని మంగళవారం ఆయన సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని, రూ.80 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఆయన వెంట తహశీల్దార్‌ జమురుద్దీన్‌, డీటీసీఎస్‌ జ్యోతి, కేంద్రం ఇంచార్జి నాగరాజు, రాజు ఉన్నారు.

పాఠశాలలు

సందర్శించిన డీఈఓ

రామగిరి(నల్లగొండ): జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి మంగళవారం తిప్పర్తి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవిని సందర్శించారు. 6 నుంచి 9వ తరగతి వరకు జరుగుతున్న పరీక్షలను, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ నెల 21 పరీక్షలు పూర్తవుతున్నందున మూల్యాంకనం పూర్తి ఫలితాలను వెలువరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ, రాజేశ్వరి పాల్గొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తరాదు

కట్టంగూర్‌ : వేసవిలో గ్రామాల్లో, పట్టణాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కట్టంగూరు ఎంపీడీఓ కార్యాలయంలో నకిరేకల్‌, కట్టంగూర్‌ మండలాల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో నల్లాల నుంచి వచ్చే తాగునీరు వృథా కాకుండా చూడాలని, నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి శుభ్రం చేయాలన్నారు. వేసవికాలంలో రెండు నెలలపాటు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. హరితహారం మొక్కలు ఎండిపోకుండా నీరు పట్టాలని, మూగజీవాలకు పశువుల తొట్టిలో నీరు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పనుల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ అదనపు పీడీ కె.నవీన్‌కుమార్‌, ఎంపీడీఓలు జ్ఞానప్రకాశ్‌రావు, చంద్రశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ నర్సింహ, ఏఈ జె.నవీన్‌, ఏపీఓలు కడియం రాంమోహన్‌, రమణయ్య, కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement