గజిబిజిగా ఉంటుంది.. మాతృత్వ అనుభవాన్ని షేర్‌ చేసుకున్న కాజల్‌ | Sakshi
Sakshi News home page

Kajal Agarwal: మనల్ని మనం మర్చిపోతుంటాం: కాజల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sat, Apr 9 2022 5:07 PM

Kajal Agarwal Emotional Post On Motherhood - Sakshi

తల్లి ప్రమోషన్‌ కొట్టేసేందుకు సిద్దమైంది కాజల్‌ అగర్వాల్‌. మరో నెల రోజుల్లో అంటే.. మే చివరికల్లా పండంటి బిడ్డకి జన్మనివ్వనుంది. ప్రస్తుతం ప్రెగ్సెన్సీ డేస్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. నిండు గర్భవతి అయిన కాజల్‌.. ప్రతి క్షణాన్ని ఆనందంగా, సంతోషంగా గడుపుతోంది.మరోవైపు బేబీ బంప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.

 తాజాగా మాతృత్వ అనుభవాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది కాజల్‌. ‘మాతృత్వానికి సిద్దపడడం చాలా అందంగా ఉంటుంది కానీ.. అదే సమయంలో మనసంతా గజిబిజిగా ఉంటుంది. అంతా మన నియంత్రణలోనే ఉంది అనుకునేలోపు తర్వాత క్షణం ఏం జరగబోతుందో తెలియకుండా పోతుంది. ఎప్పుడు ఏమి చేస్తున్నామో, ఏమి చేయాలో తెలియకుండానే సమయం గడిచిపోతుంటుంది. మన పిల్లలను, జీవిత భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు ఈ భావోద్వేగపు బంధంలో మనల్ని మనం మర్చిపోతుంటాం’అని కాజల్‌ పోస్ట్‌ చేసింది.

Advertisement
Advertisement