ప్రాణం తీసిన ఈత సరదా | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Published Sat, May 25 2024 12:30 PM

ప్రాణ

నవాబుపేట: సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అభిషేక్‌రెడ్డి కథనం మేరకు.. మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన ఆంజనేయులు (26) మిత్రులు, సోదరుడితో కలిసి మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు ఈతకు వెళ్లాడు. అందరూ కలిసి చెరువు ఇవతలి ఒడ్డు నుంచి అవతలికి ఈత ప్రారంభించారు. మధ్యకు వెళ్లాక ఆంజనేయులుకు ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతుండగా స్నేహితులు, సోదరుడు అతడిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కాని సాధ్యం కాకపోవడంతో వారు చూస్తుండగా నీటిలో మునిగిపోయాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా వారు వచ్చి మూడుగంటల పాటు గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రప్పించి గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. కాగా ఆంజనేయులుకు రెండేళ్ల కిందటే జిల్లాకేంద్రానికి చెందిన వేదా అనే యువతితో వివాహమైంది.

ప్రాణం తీసిన ఈత సరదా
1/1

ప్రాణం తీసిన ఈత సరదా

Advertisement
 
Advertisement
 
Advertisement