Sakshi News home page

అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్య

Published Thu, Nov 9 2023 1:10 AM

అశోక్‌(ఫైల్‌)  - Sakshi

లింగంపేట: మండల కేంద్రాని కి చెందిన కుంట అశోక్‌(39) రెండు రోజుల క్రితం అదృశ్యం కాగా ఉరేసుకొని మృతి చెందిన ట్లు ఏఎస్సై ప్రకాశ్‌ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉ న్నాయి.. అశోక్‌ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అశోక్‌ చెట్టుకు ఉరేసుకొని స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అశోక్‌కు వివాహమై 12 ఏళ్లు గడిచినా పిల్లలు కాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

పీడీఎస్‌ బియ్యం నిల్వ చేసిన వారిపై కేసు నమోదు

ఖలీల్‌వాడి: పీడీఎస్‌ బియ్యం నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ కిరణ్‌కుమార్‌ బుధవారం తెలిపారు. ఈనెల 7న సీసీఐ సీఐ రమేశ్‌, ఎస్సై రవీందర్‌ సిబ్బంది కలిసి పీడీఎస్‌ గోదాంలో తనిఖీలు నిర్వహించారు. ఆరోటౌన్‌ పీఎస్‌ పరిధిలోని నిజాంకాలనీలోని ఓ గోడౌన్‌లో నిర్వాహకుడు హన్జాల ఖాసీంబేగ్‌ను పట్టుకొని విచారించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మారణ ఆయుధాలు, మోటార్‌ సైకిల్‌లు, ఫోర్‌వీలర్స్‌, ఒక ఆటో, 180 బ్యాగుల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రౌడీ షీటర్‌ అలీఖాన్‌ అలియాస్‌ బర్సాద్‌ ఆమేర్‌ జైలుకి వెళ్లే ముందు నిందితుడు హన్జాలఖాసీం బేగ్‌కి మారణ ఆయుధాలను అప్పగించినట్లు తెలిపారు. హన్జాలఖాసీం బేగ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement