తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లిది కుట్టు పని | Sakshi
Sakshi News home page

తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగి, తల్లిది కుట్టు పని

Published Mon, May 20 2024 9:45 AM

-

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్‌, లలిత కుమారుడు మణితేజ. 1 నుంచి ఆరో తరగతి వరకు స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియంలో చదివాడు. వేణుగోపాల్‌ పిల్లల చదువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు భార్యా పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య లలిత ఇంటి వద్ద మిషన్‌ కుడుతూ పిల్లలను చదివించారు. ఈక్రమంలో మణితేజ 6 నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ స్కూల్‌లో చదివాడు. పదోతరగతిలో 8.2 జీపీఏ మార్కులు సాధించిన మణితేజ ఇంటర్‌ హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఎస్‌ఆర్‌ శ్రీగాయత్రి కళాశాలలో ఎంపీసీ చదివాడు. ఇంటర్‌లో 715 మార్కులు సాధించాడు. కాగా ఈఏపీసెట్‌లో ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందాడు. స్టేట్‌ ర్యాంక్‌ సాధించిన మణితేజను శివునిపల్లి వాసులు, స్నేహితులు, బంధువులు అభినందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement