Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం

Published Wed, Aug 17 2022 6:47 AM

Today Horoscope 17-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.షష్ఠి రా.12.02 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం: అశ్వని రా.2.23 వరకు, తదుపరి భరణి వర్జ్యం: రా.10.16 నుండి 11.55 వరకు దుర్ముహూర్తం: ప.11.37 నుండి 12.28 వరకు అమృతఘడియలు: రా.7.02 నుండి 8.54 వరకు. 

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.23
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం: దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. దైవదర్శనాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కర్కాటకం: ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.

సింహం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.

Advertisement
Advertisement