ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పాతమిత్రుల కలయిక | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పాతమిత్రుల కలయిక

Published Thu, Dec 30 2021 6:05 AM

Today Horoscope Telugu 30-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి ఉ.9.43 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం విశాఖ రా.9.45 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం రా.1.31 నుండి 3.01 వరకు, దుర్ముహూర్తం ఉ.10.12 నుండి 10.56 వరకు, తదుపరి ప.2.35 నుండి 3.21 వరకు అమృతఘడియలు... ప.1.26 నుండి 2.56 వరకు.

సూర్యోదయం :    6.33
సూర్యాస్తమయం    :  5.31
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్యమైన పనులు పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కర్కాటకం: ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: చిన్ననాటి మిత్రుల కలయిక. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.

కన్య: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

ధనుస్సు: వేడుకలకు హాజరవుతారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మకరం: కుటుంబసమస్యలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మానసిక అశాంతి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: సన్నిహితులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

Advertisement
Advertisement